"ఏ.పీ" పై పడిన జపాన్ కన్ను!!

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీమాంధ్రలో అనేక ఇబ్బందులు ఉన్నాయి… అయితే అందులో ముఖ్యమైనది రాజధాని నిర్మాణం, రునమాఫీ.ఈ సవాళ్లను స్వీకరిస్తూ గద్దెను ఎక్కిన బాబు దీనిపై భారీగానే కష్ట పడుతున్నట్లు కనిపిస్తుంది.

 Japan Ready For Investments In India-TeluguStop.com

పెద్దగా ఉపయోగం లేకపోయినా కేంద్రం కాళ్ళు పట్టుకుంటూ ఏదో రకంగా కేంద్రం నుంచి సహకారం అందుకుని ఈ ఇబ్బందులను తొలగించాలని చూస్తున్నారు ముఖ్యమంత్రి.అందులో భాగంగానే రానున్న 5ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ను ఒక గాడిలో పెట్టాలని తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక ఆ ప్రగతి కోసమే ఆ మధ్య జపాన్, సింగపూర్ వంటి దేశాలు తిరిగివచ్చారు కూడా.అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం జపాన్ దేశానికి చెందిన కొన్ని సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీగే ఉన్నాయని తెలుస్తుంది.

మార్చి 4న 50 జపాన్‌ కంపెనీలు రాష్ట్రానికి వస్తాయంట.అంతే కాదు.

మరో 250 కంపెనీలు నవ్యాంధ్ర కేంద్రంగా ప్రత్యేక కార్యాలయాలు నెలకొల్పబోతున్నాయట.మరి జపాన్ కన్ను ఏపీపై ఎందుకు పడిందనుకుంటున్నారా.

ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న జపాన్‌… వచ్చే ఐదేళ్లలో భారత్‌లోని ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోందట.అందులోనూ చంద్రబాబు వంటి డైనమిక్ సీఎం ఉన్నారు కాబట్టి ఏపీనే సెలక్టు చేసుకున్నారట.

ఇదంతా నిజమైతే.నిజంగా 250 జపాన్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడితే.

ఆంధ్రప్రదేశ్ ప్రజల కల నెరవెరినత్లెంఅరి ఏది ఎంతవరకూ జరుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube