జపాన్ 126 వ చక్రవర్తి గా నురుహితో

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన రాజ్యం జపాన్ 126 వ చక్రవర్తి గా నురుహితో భాద్యతలు చేపట్టినట్లు తెలుస్తుంది.ఆయన తండ్రి అకిహితో(85) చక్రవర్తి గా సింహాసనం నుంచి దిగిపోవడం తో జపాన్ తదుపరి చక్రవర్తిగా నురుహితో నిలిచారు.59 ఏళ్ల ఆయన బుధవారం శాస్త్రోక్తంగా సింహాసనాన్ని అధిష్టించినట్లు తెలుస్తుంది.నురుహితో చక్రవర్తి గా ఉన్నంతవరకు ఉన్న కాలాన్ని రీవా శకంగా పేర్కొంటారు.

 Japan New Emperor Naruhito Succeeds Father Akihito 126-TeluguStop.com

దీనితో అక్కడ రీవా శఖం ప్రారంభమైంది.రీవా అంటే అందమైన సామరస్యం అని అర్ధం.

అకిహితో గత 30 ఏళ్ల నుంచి జపాన్ చక్రవర్తి గా పదవిలో ఉన్నారు.అయితే జపాన్ చరిత్రలో ఒక చక్రవర్తి తనంతట తానూ గా ఆ పదవి నుంచి తప్పుకోవడం గత 200 ఏళ్లలో ఇదే తొలిసారి.

అకిహితో తన పదవి నుంచి తొలగి పోవడం తో ఆయన స్థానంలో నురుహితో ఆ భాద్యతలు చేపట్టారు.

అకిహితో పదవి నుంచి దిగిపోవడం తో ఆయన పదవి నుంచి దిగిపోయే ముందు తన చివరి రాజప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా జపాన్ ప్రజలకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అకిహితోకు వీడ్కోలు పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.అయితే వర్షం రావడంతో వేడుకలకు విఘాతం కలిగింది.జపాన్ వ్యాప్తంగా ప్రజలు ఈ వేడుకలను పెద్ద తెరలపై వీక్షించారు.

అకిహితో చక్రవర్తిగా చాలా బాగా పనిచేశారనీ, కొత్త చక్రవర్తి కూడా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తాడని తాము విశ్వసిస్తున్నామని అక్కడి ప్రజలు తెలిపారు.కాగా, కొన్నిచోట్ల రాచరిక వ్యవస్థను వ్యతిరేకించే వారికి, సమర్థించే వారికి మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube