వికలాంగులంటే అసహ్యం: 19 మంది దారుణహత్య, నిందితుడికి మరణశిక్ష

వికలాంగులు పట్ల సహజంగానే జాలి చూపించి అవసరమైతే వారికి సాయం చేస్తారు కొందరు.అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 19 మంది వికలాంగులను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

 Japan Man Sentenced To Death For Killing 19 People At Care Home 19-TeluguStop.com

అతని దురాగతాలపై విచారణ జరిపిన కోర్టు మరణశిక్ష విధిస్తూ సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.

దేశ రాజధాని నగరం టోక్యోలోని సగమిహర అనే ఓ సంరక్షణ గృహంలో పనిచేస్తున్న 30 ఏళ్ల సటోషీ విమాట్సు 2016 జూలై 26వ తేదీ తెల్లవారుజామున తన వెంట కత్తులను తెచ్చుకున్నాడు.

కిటికీ అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన అతను లోపల నిద్రిస్తున్న వికలాంగులను ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్లాడు.ఈ ఉన్మాద దాడిలో 19 మంది మరణించగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బాధితులంతా 19 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు వారే.తన హింసాకాండ పూర్తయిన తర్వాత సటోషి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

ఈ సమయంలో అతని వద్ద రక్తంతో తడిసిన అనేక కత్తులు లభించాయి.దాడి జరిగిన సమయంలో సంరక్షణ కేంద్రంలో 150 మంది వికలాంగులు, 9 మంది పనివాళ్లు ఉన్నారు.

ఈ దాడితో ప్రపంచంతో పాటు జపాన్ దిగ్భ్రాంతికి గురైంది.అప్పటి నుంచి సుధీర్ఘ విచారణ జరిపిన కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది.ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ… ఇతనిపై ఎటువంటి దయా, దాక్షిణ్యాలు చూపాల్సిన అవసరం లేదు.19 మంది ప్రాణాలు తీయడం అత్యంత తీవ్రమైన విషయం అని న్యాయమూర్తి అవోనుమా అన్నారు.ఈ హత్యలన్నీ నిందితుడు ఉద్దేశ్యపూర్వకంగానే చేశాడని ఆయన స్పష్టం చేశారు.

Telugu Japan, Japansentenced, Telugu Nri-Telugu NRI

అయితే తమ క్లయింట్ గతంలో ఎలాంటి నేరాలు చేయలేదని, ఘటన జరిగిన సమయంలో సటోషీ మారిజువానా అనే మాదక ద్రవ్యం సేవించడం వల్ల మానసిక వైకల్యంతో ఉన్నాడని అతని తరపు న్యాయవాదులు వాదించారు.అయితే ఈ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది.కాగా ఇటీవల ఈ నేరంపై స్పందించిన సటోషి ‘‘ మానసిక వికలాంగులు జీవించడం వృథా.

దివ్యాంగులు హానికరం, వారు దురదృష్టాన్ని తీసుకొస్తారని తనకు అవకాశం ఇస్తే మరో 470 మంది దివ్యాంగులను చంపేస్తానంటూ వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది.ఈ నరహంతకుడికి కోర్టు మరణశిక్ష విధించడం పట్ల బాధితుల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube