ప్రియురాలికి వింతైన ఉంగరంను గిఫ్ట్‌, దానికి తన శరీర భాగాన్ని ఉపయోగించాడు

తన ప్రియురాలికి చాలా విభిన్నమైన, ఆమెను ఆకట్టుకునే, ఆశ్చర్యపోయే, సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.అందుకు చాలా ఖరీదు అవుతుంది.

 Japan Man Makes Disgusting Engagement Ring For His Lover It Takes One Year-TeluguStop.com

మద్య తరగతి వారు కూడా కాస్త ఆలోచిస్తే అత్బుతమైన గిఫ్ట్‌లను, ఆమె ఎప్పటికి మర్చిపోలేని గిఫ్ట్‌ను ఇవ్వొచ్చు.ఒక వ్యక్తి తన ప్రియురాలికి ఇచ్చిన ఉంగరం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

అతడి ఆలోచనకు అంతా కూడా ఫిదా అవుతున్నారు.అతడి లవర్‌ ఎలా ఫీల్‌ అయ్యిందో కాని ఇతరుల లవర్స్‌ అంతా కూడా అతడిని చూసి కుళ్లుకుంటూ ఉంటారు.

నా లవర్‌ ఇలాంటి గిఫ్ట్‌ ఇవ్వడాయెను అనుకునేలా అతడు చేశాడు.

Telugu Japanlover, Japan Lover, Nails Gift, Telugu General-

  వివరాల్లోకి వెళ్తే.జపాన్‌కు చెందిన ఒక వ్యక్తి తన ప్రియురాలికి విభిన్నమైన ఒక ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాడు.డబ్బులు ఎక్కువ ఖర్చు చేయకుండానే ఆమెను ఆనందింపజేయడంతో పాటు, ఆశ్చర్యపర్చాలనుకున్నాడు.

తాను ఇచ్చే ఉంగరం ఈ ప్రపంచంలో అదొక్కటే ఉండాలని కూడా అనుకున్నాడు.అందుకోసం తన భారీలో ఒక పార్ట్‌ అయిన తన వేలి గోర్లను ఉపయోగించాలనుకున్నాడు.

అందుకోసం సంవత్సరం పాటు అతడు చాలా ఓపికగా తన గోర్లను సేకరించాడు.తన గోర్లు మాత్రమే ఆ ఉంగరంకు ఉపయోగించాడు.

Telugu Japanlover, Japan Lover, Nails Gift, Telugu General-

  సంవత్సరం పాటు అతడి తీసిన గోర్లను ఒక మిక్సీలో వేసి పొడిగా తయారు చేశాడు.ఆ తర్వాత ఆ పొడికి కాస్త నీళ్లు కలిపి ముద్దగా తయారు చేశాడు.ఆ ముద్దను ఒక డిజైన్‌ వచ్చేలా తయారు చేసి దాన్ని మైక్రో ఓవెన్‌లో పెట్టాడు.మైక్రో ఓవెన్‌ వేడికి ఆ గోర్ల పొడి తెల్లగా ఉండేది కాస్త నల్లగా అయ్యింది.

బయటకు తీసిన తర్వాత దాన్ని ఇంకాస్త మెరుగు దిద్దాడు.చివరకు అది బ్లాక్‌ డైమెండ్‌ మాదిరిగా తయారు అయ్యింది.

అతడు చెప్పకుంటే అది నిజంగా డైమెంట్‌ అనుకుంటారు ఎవరైనా.

Telugu Japanlover, Japan Lover, Nails Gift, Telugu General-

  తాను ఆ ఉంగరం తయారు చేసే విధానంను పూర్తిగా వీడియో తీసి పోస్ట్‌ చేశాడు.అతడు వీడియో తీయడంతో అది గోర్లతో తయారు చేసిన డైమండ్‌ అని అర్థం అయ్యింది.చాలా జాగ్రత్తగా.

ఓపికగా అతడు తన లవర్‌ కోసం చేసిన ఉంగంరంకు అంతా ఫిదా అవుతున్నారు.ఒక అద్బుతమైన డిజైన్‌ ఉంగరంగా ఆ ఉంగరం తయారు అయ్యింది.

అతడి పనితనంకు అంతా మెచ్చుకుంటున్నారు.ఇదే సమయంలో అతడికి అతని ప్రియురాలిపై ఉన్న ప్రేమను అంతా అభినందిస్తున్నారు.

చాలా మంది అమ్మాయిలు ఈ విషయాన్ని వారి లవర్స్‌కు చూపించి దెప్పిపొడుస్తూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube