కేవలం రూ.66 లకే రూమ్ అద్దెకు,కానీ

ఏదైనా హోటల్ లో రూమ్ తీసుకోవాలి అంటే కనీసం 1000 రూపాయల నుంచి 1500 రూపాయలవరకు ఉంటుంది.అలాంటిది రూ.66 చెల్లిస్తే రూమ్ దొరుకుతుంది అని అంటే మీరు నమ్ముతారా.నిజంగా రూ.66 రూమ్ అద్దెకు దొరుకుతుంది అంతేకాకుండా అన్ని వసతులతో మరి రూమ్ ని ఇస్తుంది.ఇంతకీ ఇంత చీప్ గా రూమ్ అద్దెకు ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటున్నారా.

 Japan Hotel Offers Room Rs 66 One Night-TeluguStop.com

మనదేశంలో కాదు లెండీ జపాన్ లో ఇలాంటి వసతి దొరుకుతుంది.జపాన్ లోని అసాహి ర్యోకన్ అనే హోటల్ లో ఇలాంటి వసతి కలుగుతుంది.ఆ హోటల్ లో కేవలం 100 యెన్ లు చెల్లిస్తే అంటే మన కరెన్సీ ప్రకారం రూ.66 మాత్రమే అన్నమాట.కేవలం అంత మొత్తం చెల్లిస్తే ఒక రాత్రికి గదిని అద్దెకు ఇస్తుంది.ఎదో చీప్ గా దొరుకుతుంది కదా అని లోపల ఎలాంటి సదుపాయాలు లేవు అని అనుకుంటే పొరపాటే.

నేలపై బెడ్డు, టీవీ, టేబుల్, టీపాయ్, ఫ్యాన్, శుభ్రంగా ఉండే బాత్రూం అన్నీ ఉంటాయి.అన్నీ వసతులు ఇంత చీప్ గా ఏంటి అని అనుకుంటున్నారా.ఇందులోనే ఒక మెలిక ఉంది.అదే అక్కడ రూమ్స్ మనకు కావాలి అంటే నిర్వాహకులు పెట్టే ఒక కండీషన్‌‌కి అంగీకారం తెలపాలి.

Telugu Japan Hotel, Rs, Telugu Ups-

అది ఏంటంటే.రాత్రి మొత్తం మీ బసని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలి.కొన్ని ప్రైవసీ సందర్భాల్లో మాత్రం అందుకు మినహాయింపు ఉంటుంది తప్ప మిగతా అన్ని సమయాల్లో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుందట.

గతంలో ఆ హోటల్‌‌లో బస చేసిన ఓ బ్రిటిష్ యూట్యూబర్‌ ఇలాగే తన గడిపిన సమయం మొత్తాన్ని లైవ్‌స్ట్రీమ్‌ చేయడం తో ఆ ఐడియా నచ్చిన హోటల్ యాజమాన్యం అదే థీమ్‌ను ఫాలో అయిపోతుందట.అందుకే ఈ వెరైటీ అనుభూతిని ఆస్వాదించాలని చాలామంది టూరిస్టులు ఆ హోటల్ కు క్యూ కడుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube