శవపేటికలో భయాన్నిఆస్వాదించాలి అంటే ఆ దేశం వెళ్ళండి

చనిపోయిన తర్వాత క్రిస్టియన్ సంప్రదాయంలో ఎక్కువగా మృతదేహాలని శవపేటికలో పెట్టి పూడ్చి పెడతారు.మన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చనిపోయిన వారి మృతదేహాలు తీసుకురావడానికి మన దేశంలో కూడా శవపేటికలు ఉపయోగిస్తారు.

 Japan Group Offers Coffins, Chainsaws For Stress Relief, Corona Fear, Japan, Cov-TeluguStop.com

అలాగే పెద్ద పెద్ద కుటుంబాలలో ఈ శవపేటికలలో మృతదేహాన్ని ఉంచి చూడటానికి వచ్చేవారి కోసం ఏర్పాటు చేస్తారు.ఇదిలా ఉంటే కరోనా కారణంగా చాలా మందికి మృత్యు భయం పట్టుకుంది.

అందరూ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు.అయితే చావు భయం కంటే చనిపోతామనే ఆలోచన చాలామందిని దెయ్యంలా భయపెడుతుంది.

ఈ భయాన్ని పోగొట్టడం కోసం జపాన్ లో ఓ డిఫరెంట్ షోని ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ప్రారంభించింది.ఇప్పుడు ఈ షోని ఆ దేశంలో చాలా మంది ఆశ్వాదిస్తున్నారు.
ఈ షోలో భాగంగా క‌స్ట‌మ‌ర్ శ‌వ‌పేటిక‌లో ప‌డుకుంటే భ‌యాన‌క అరుపులు వినిపిస్తాయి.అంతేకాకుండా ఈ పెట్టె బ‌య‌టినుంచి కొంద‌రు వ్య‌క్తులు దెయ్యాలుగా మిమ్మ‌ల్ని భ‌య‌పెడుతుంటారు.” స్కేర్ స్క్వాడ్” పేరుతో ఉండే ఈ షోలో 15 నిమిషాల సేపు గ‌డ‌పొచ్చు.కోవిడ్ అనే భ‌యం నుంచి కాసేపు ఉప‌శ‌మ‌నం పొందడానికి ఈ వినూత్న ఈవెంట్ స్టార్ట్ చేసినట్లు నిర్వాహ‌కులు కెంటా ఇవానా తెలిపారు.

క‌రోనా వల్ల ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న ఒత్తిడిని వ‌దిలించేందుకు మాదో చిన్న ప్ర‌య‌త్నం అని అన్నారు.అంతేకాకుండా సామాజిక దూరం పాటించేలా ప్లాస్టిక్ షీల్డ్‌లు, గ్ల‌వుజులు వంటి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు.

వారాంతాల్లో నిర్వ‌హించే ఈ హార్ర‌ర్ షోల‌కి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని, వారు సైతం ప్ర‌త్యామ్నాయ‌ల‌ను వెతుక్కుంటున్నార‌ని పేర్కొన్నారు.మొత్తానికి ఒక భయాన్ని పోగొట్టుకోవడం కోసం మరో రకంగా భయపెట్టడం అనే కాన్సెప్ట్ తో ప్లాన్ చేసిన ఈ షో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube