అంధుడు సాహస యాత్ర! చరిత్రలో గుర్తుండిపోతుంది  

పసిఫిక్ సముద్రాన్ని ప్రయాణించి చరిత్ర సృష్టించిన అంధుడు. .

Japan Blind Navel Driver Finish Historical Feet-finish Historical Feet,japan Blind Navel Driver,pacific Ocean

వైకల్యం శరీరానికే కాని మనసుకి కాదని, సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు అని ఇప్పటికే ప్రపంచంలో చాలా మంది రుజువు చేసారు. తమ వైకల్యాన్ని చిన్నతనం చేసే సమాజానికి తామేంటో పరిచయం చేసిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు అలాంటి సంఘటన మరోసారి జరిగింది..

అంధుడు సాహస యాత్ర! చరిత్రలో గుర్తుండిపోతుంది-Japan Blind Navel Driver Finish Historical Feet

జపాన్ కి చెందిన ఒక అంధుడు చరిత్ర సృష్టించాడు. ఏకంగా పసిఫిక్ మహా సముద్రపైపై ఒంటరిగా ప్రయాణించి అమెరికా నుంచి జపాన్ వెళ్ళిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే జపాన్కు చెందిన మిట్సుహిరో ఇవామోటో పసిఫిక్ మహాసముద్రం మీద ఒంటరిగా ప్రయాణించి చరిత్ర సృష్టించాలని బలంగా అనుకున్నాడు.

గతంలో ఓ సారి ప్రయత్నం చేసాడు. అయితే దానికి అనుకోకుండ అవాంతరం వచ్చింది. అయితే రెండో సారి మాత్రం తన సంకల్పం మరింత బలపడింది.

కళ్లు లేనప్పటికీ 12 మీటర్ల బోటులో అమెరికా నుంచి జపాన్ వరకు పసిఫిక్ సముద్రంలో 14 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చేశాడు. శనివారం జపాన్కు చేరుకున్న ఇవామోటోకు అనేకమంది ఘనస్వాగతం పలికారు. ఫిబ్రవరి 24న కాలిఫోర్నియాలో మరోవ్యక్తితో కలిసి ప్రయాణం మొదలుపెట్టగా. శనివారం ఫుకుషిమా పోర్టుకు విజయవంతంగా చేరుకున్నాడు.