జనవరి నెల బాక్సాఫీస్ రివ్యూ ఇదే.. బాక్సాఫీస్ విజేత ఎవరంటే?

ప్రతి సంవత్సరం జనవరి నెలలో పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయనే సంగతి తెలిసిందే.సంక్రాంతికి విడుదలైన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు బ్రేక్ అవుతాయి.2023 సంవత్సరం జనవరి నెలలో విడుదలైన సినిమాలను పరిశీలిస్తే విభిన్నమైన ఫలితాలు వచ్చాయి.జనవరి మొదటి వారంలో జర్నీ టు కాశీ, దోస్తాన్, మైఖేల్ గ్యాంగ్, ప్రత్యర్థి సినిమాలు రిలీజ్ అయ్యాయి.

 January Month Box Office Review Waltair Veerayya Veerasimha Reddy Pathaan Thegim-TeluguStop.com

ఈ సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా చాలామంది సినీ అభిమానులకు తెలియదు.జనవరిలో ఒక్కడు మూవీ రీరిలీజ్ కాగా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

సంక్రాంతి పండుగ కానుకగా ఐదు సినిమాలు విడుదల కాగా ఐదు సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి.జనవరి 11వ తేదీన అజిత్ హీరోగా తెరకెక్కిన తెగింపు రిలీజ్ కాగా అజిత్ అభిమానులకు, ఒక వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చింది.

Telugu Hunt, January, Mallikapuram, Pathaan, Sankranthi, Sindhuram, Thegimpu-Mov

జనవరి 12వ తేదీన వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ కాగా ఈ సినిమాకు ఇప్పటివరకు 75 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాగా బాలయ్య ఫ్యాన్స్ కు ఈ మూవీ తెగ నచ్చింది.బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ఇప్పటివరకు 250 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కలెక్షన్లను సాధించగా ఫుల్ రన్ లో ఈ మూవీ కలెక్షన్లు ఎక్కడ ఆగుతాయో చూడాలి.

Telugu Hunt, January, Mallikapuram, Pathaan, Sankranthi, Sindhuram, Thegimpu-Mov

రిపబ్లిక్ డే సమయంలో హంట్, వాలంటైన్స్ నైట్, సింధూరం, మాలికాపురం, పఠాన్ రిలీజ్ కాగా పఠాన్ కు మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది.జనవరి నెల బాక్సాఫీస్ విన్నర్ వాల్తేరు వీరయ్య అని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఫిబ్రవరి నెల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్లుగా నిలుస్తాయో ఎలాంటి ఫలితాలు అందుకుంటాయో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube