పరువు నష్టం దావాకు సిద్దమైన జనసేనాని  

Jansenani Ready For Defamation Suit-janasena And Ycp,jansenani

అమరావతిలోనే రాజధాని కొనసాగాలంటూ రైతులకు మద్దతుగా జనసేన పార్టీ కార్యక్రమాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే.ఇటీవలే ఈ విషయమై ఢిల్లీ కూడా వెళ్లి పెద్దలకు రాజధాని విషయమై మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

Jansenani Ready For Defamation Suit-Janasena And Ycp

పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్లిన సమయంలోనే అమరావతిలో రాజధాని కొనసాగాలంటూ పవన్‌ చేస్తున్న ప్రయత్నాలకు కారణం ఆయనకు ఉన్న 62 ఎకరాలు అంటూ వైకాపా నాయకులు కొందరు ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

అమరావతిలో పవన్‌కు ఆయన తల్లికి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం 62 ఎకరాల భూమి ఉందని, ఆ భూమి కారణంగానే అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ పవన్‌ ఆందోళనలు చేస్తున్నాడు.

గతంలో అమరావతి రాజధానిగా వద్దన్న పవన్‌ ఇప్పుడు భూమి కోసం రాజధాని కావాలంటున్నాడు అంటూ ప్రచారం చేయడంతో జనసేన పార్టీ సీరియస్‌ అయ్యింది.తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు డాక్యుమెంట్లను చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ జనసేన ఒక ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది.

వైకాపా నాయకులు అంటున్నట్లుగా అసలు అమరావతిలో పవన్‌కు భూమి లేదు.అవన్ని కూడా గ్లోబల్స్‌ ప్రచారం.ఆ ప్రచారంకు కారకులు అయిన వారిపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఈ సందర్బంగా జనసేన పార్టీ ప్రకటనలో పేర్కొనడం జరిగింది.

తాజా వార్తలు

Jansenani Ready For Defamation Suit-janasena And Ycp,jansenani Related....