జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొంటున్నారు.ఒక పక్క సినిమాలు చేస్తూనే, ఏపీ రాజకీయాలను దడ దడలాడించే పనుల్లో ఉన్నారు.
గతంలో ఎప్పుడు ఈ రేంజ్ లో పవన్ యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించలేదు.దీనికి తోడు ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు జనసేనకు సంతృప్తికరంగా రావడంతో పవన్ లోనూ కాన్ఫిడెన్స్ మరింత పెంచింది.
ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తెలంగాణ రాజకీయాల్లో నింపేందుకూ పవన్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తాము అంటూ ప్రకటించగానే అంతా ఆశ్చర్యపోయారు.
అసలు జనసేనకు తెలంగాణలో బలం లేదని, అటువంటిది ఎలా పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు అనే ఆందోళనలో ఉండగానే ఆకస్మాత్తుగా తాము పోటీ నుంచి తప్పుకుంటున్నామని, బిజెపికి మద్దతు ఇస్తున్నామని జనసేన నుంచి ప్రకటన వెలువడింది.ఇప్పుడు చూస్తే తెలంగాణ రాజకీయాలు మరింతగా వేడెక్కాయి.

ఒక పక్క బిజెపి, టిఆర్ఎస్ కాంగ్రెస్ తలపడుతుండగానే కొత్తగా షర్మిల పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉండడం, ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తూ, అందరినీ ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉండడం వంటి వ్యవహారాలు మరింత ఆసక్తికరంగా మారాయి.షర్మిల కేసిఆర్ వదిలిన బాణం అని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను దెబ్బతీసేందుకు ఓట్లను చీల్చేందుకు కేసీఆర్ షర్మిలను తెరపైకి తెచ్చారనే ప్రచారం జోరందుకున్న క్రమంలో ఇప్పుడు అకస్మాత్తుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన యాక్టీవ్ చేయాలని నిర్ణయించుకోవడం, ఈ మేరకు తెలంగాణ జనసేన వీర మహిళల సమావేశాన్ని నిర్వహించారు.
జనసేనకు కాస్తో కూస్తో బలం ఉన్న ఏపీ లోనే వీర మహిళల సమావేశంపై జనసేన పార్టీ దృష్టి పెట్టలేదు.కానీ తెలంగాణలో బలం లేకపోయినా , ఇక్కడ యాక్టీవ్ కావడానికి షర్మిల పార్టీని ఇరుకున పెట్టేందుకు, తద్వారా టిఆర్ఎస్ కు సైతం రాజకీయ ఇబ్బందులు సృష్టించేందుకు, బిజెపి సూచన మేరకే పవన్ ఇక్కడ ఇప్పుడు యాక్టీవ్ రోల్ పోషించేందుకు ముందుకొస్తున్నట్టుగా అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి.