ప‌వ‌న్ ఏపీలో హీరోనా...? జీరోనా...? డిసైడ్ చేసేది ఇదొక్క‌టే...!  

Pawan kalyan Not Getting BJP leaders Appointment in Delhi, Delhi Tour, Janasena Chief Pawan kalyan, BJP Leaders, Nadda, Janasena, Tirupathi by elections, Movie Shootings - Telugu Bjp Leaders, Delhi Tour, Janasena, Janasena Chief Pawan Kalyan, Movie Shootings, Nadda, Pawan Kalyan Not Getting Bjp Leaders Appointment In Delhi, Tirupathi By Elections

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌డావిడిగా ఢిల్లీ వెళ్లారు.బీజేపీ పెద్దలు ప‌వ‌న్‌ను పిలిచారా ?  లేదా ప‌వ‌నే వెళ్లాడా ? అన్న‌ది తెలియ‌దు కాని ప‌వ‌న్ ఎంత స్పీడ్‌గా ఢిల్లీ వెళ్లినా అక్క‌డ మాత్రం బీజేపీ పెద్ద‌ల అపాయింట్‌మెంట్ అయితే రావ‌డం లేదు.ఇప్ప‌టికే ప‌వ‌న్‌కు అక్క‌డ ఓ రోజంతా వేస్ట్ అయ్యింది.ఇప్ప‌టివ‌ర‌కు ప‌వ‌న్‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది.అస‌లు ప‌వ‌న్‌కు అపాయింట్‌మెంట్ ఉంటుందా ?  లేదా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి.

TeluguStop.com - Jansena Pawan Kalyan Waiting For Bjp Leaders Appointment Delhi

నిన్న మొన్న‌టివ‌ర‌కు సినిమాల్లో బిజీగా ఉన్న ప‌వ‌న్ అంత హ‌డావిడిగా ఢిల్లీ ఎందుకు ?  వెళ్లారు ? అన్న‌ది కూడా క్లారిటీ లేదు.తిరుప‌తి పార్ల‌మెంటు సీటుకు జ‌రిగే ఉప ఎన్నికల్లో బీజేపీ తామే పోటీ చేస్తున్న‌ట్టు ఏక‌ప‌క్షంగా ప్ర‌క‌ట‌న చేసింది.అయితే అక్క‌డ బీజేపీ కంటే పార్ల‌మెంటు సీటు ప‌రిధిలో ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ఎక్కువ‌.

జ‌న‌సేన‌కు కేడ‌ర్ ఉంది.అందుకే తామే ఇక్క‌డ పోటీ చేస్తామని జ‌న‌సేన ప‌ట్టుబ‌డుతోంది.

TeluguStop.com - ప‌వ‌న్ ఏపీలో హీరోనా… జీరోనా… డిసైడ్ చేసేది ఇదొక్క‌టే…-Political-Telugu Tollywood Photo Image

ఓ వైపు సోష‌ల్ మీడియాలోనూ, మీడియాలోనూ మాత్రం ప‌వ‌న్‌కు ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల అపాయింట్‌మెంట్ దొర‌క‌డం లేదన్న చర్చ‌లు వ‌స్తున్నాయి.

ప‌వ‌న్ మ‌రో ఒక‌టి రెండు రోజులు ఆగినా అపాయింట్‌మెంట్ వ‌స్తుందా ?  రాదా ? అన్న సందేహాలు ఉన్నాయి.చివ‌ర‌కు ప‌వ‌న్ ఇంత హ‌డావిడితో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల అపాయింట్‌మెంట్ దొర‌క్క‌పోతే ప‌వ‌న్ రాజకీయాల్లో మ‌రింత బ‌క‌రా అయిపోతాడు.నిజంగా ప‌వ‌న్ తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌కు బీజేపీని దూరంగా ఉంచి త‌మ పార్టీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దించితే హీరోయే అవుతాడు.

లేక‌పోతే ప‌వ‌న్ ఎప్ప‌టి మామూలుగానే పొలిటిక‌ల్ జీరోనే అవుతాడు.మ‌రి ప‌వ‌న్ ఏం అవుతాడో ?  చూడాలి.

#PawanKalyan #Nadda #Janasena #TirupathiBy #JanasenaChief

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు