తిరుప‌తి పోయింది.. జ‌న‌సేన‌లో అంత‌ర్మ‌థ‌నం...!  

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ తీవ్ర అంత‌ర్మ‌థ‌నంలో చిక్కుకుంది.దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత ఏపీలో జ‌ర‌గ‌నున్న తిరుప‌తి ఉప ఎన్నిక‌లో పోటీ చేయాల‌ని పార్టీ దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింది.

TeluguStop.com - Jansena Pawan Kalyan Tirupathi By Elections

ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ నుంచి గ‌ట్టి నేతను నిల‌బెట్టి.స‌త్తా చాటాల‌ని కూడా ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నారు.

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటుకు పోటీ చేసినా.ఏ ఒక్క‌రూ జ‌న‌సేన త‌రపున విజ‌యం సాధించ‌లేదు.

TeluguStop.com - తిరుప‌తి పోయింది.. జ‌న‌సేన‌లో అంత‌ర్మ‌థ‌నం…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

స‌రిక‌దా.కొంద‌రు.

డిపాజిట్‌ను కూడా వ‌దులుకున్నారు.దీంతో ప‌వ‌న్ తీవ్రంగా హ‌ర్ట్ అయ్యారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇప్పుడు అందివ‌చ్చిన అవ‌కాశంగా తిరుప‌తిని వినియోగించుకుందామ‌ని స్కెచ్ గీసుకున్నారు.

ఎస్సీ మ‌హిళ‌కు ఇవ్వాల‌నేది ప‌వ‌న్ వ్యూహంగా కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే.అభ్య‌ర్థి ఎంపిక వ‌ర‌కు విష‌యం వెళ్ల‌లేద‌ని అంటున్నారు.

కేవలం చ‌ర్చ‌ల‌వ‌ర‌కే ఉంద‌ని అంటున్నారు.ఇదిలావుంటే.

ఇప్పుడు. జ‌న‌సేన బీజేపీతో పొత్తులో ఉంది క‌నుక‌.

ఇరు పార్టీల్లోనూ తిరుప‌తి పోరుపై ఆశ‌లు ఉన్నాయి.రెండు పార్టీలూ.

ఇక్క‌డ పోటీ చేయాల‌ని భావిస్తున్నాయి.దీంతో ఇరు ప‌క్షాల న‌డుమ ఈ సీటు విష‌యంలో కిరికిరి ఏర్ప‌డుతోంద‌ని అంటున్నారు.

తాజాగా ఇదే విషయంపై ప‌వ‌న్ ఓ క్లారిటీ ఐడియా ఇచ్చారు.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో .జ‌న‌సేన‌.పోటీ చేయాల‌ని అనుకుని కూడా బీజేపీకి మ‌ద్ద‌తివ్వాల‌ని నిర్ణ‌యించుకుని ప‌క్క‌కు త‌ప్పుకొంది.

దీంతో.మేం గ్రేట‌ర్‌లో మీకోసం త్యాగం చేశాం క‌నుక‌.

మీరు మాకోసం తిరుప‌తి వ‌దిలేయాల‌నేది ప‌వ‌న్ ప్లాన్‌.అయితే.

ఇక్క‌డి నేత‌లు మాత్రం తిరుప‌తి వ‌దులుకునేందుకు తాము సిద్ధంగా లేమ‌ని ఇప్ప‌టికే చెప్పుకొస్తున్నారు.దీనికి బీజేపీ చెబుతున్న కార‌ణాలు.

తిరుప‌తిని తామే డెవ‌ల‌ప్ చేశామ‌ని.న‌రేంద్ర మోడీ తిరుపతిని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి.

అనేక రూపాల్లో అభివృద్ది చేశారు క‌నుక త‌మ‌కే ఇక్క‌డ అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని.జ‌న‌సేన‌కు ఇస్తే.

మ‌ళ్లీ వైసీపీ గెలుపు గుర్రం ఎక్కుతుంద‌ని బీజేపీ నాయ‌కులు భావిస్తున్నారు.

దీంతో జ‌న‌సేన‌కు దాదాపు తిరుప‌తి ద‌క్కే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.దీంతో జ‌న‌సేన నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు కూడా అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.ఈ క్ర‌మంలోనే హుటాహుటిన ప‌వ‌న్‌.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు కూడా వెళ్ల‌డం గ‌మ‌నార్హం.కానీ, అక్క‌డ కూడా ప‌వ‌న్‌కు ఆశించిన స్థాయిలో మ‌ద్ద‌తు ల‌భించ‌లేద‌ని అంటున్నారు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

#Thinking #Tirupathi MP #Modi #Smart City #Competition

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు