జనసేన విధేయులు ఎంత మందో తెలిసే సమయం వచ్చిందా

ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నంలో జనసేన పార్టీ పెట్టి రాజకీయాలలో తనదైన ముద్ర వేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసారు.ఎన్నికలకి ముందు ప్రజలలోకి విస్తృతంగా వెళ్లి పార్టీని ప్రజలకి చేరువ చేసే ప్రయత్నం చేసారు.

 Jansena Party Leaders Concentrate On Other Parties-TeluguStop.com

దీంతో తాజా జరిగిన ఎన్నికలలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది అని అతను గణనీయమైన ప్రభావం చూపించి ఏపీ రాజకీయాలలో ఊహించని మార్పులు తీసుకొస్తాడని రాజకీయ వర్గాలలో వినిపించింది.అయితే ఎప్పటిలాగే ఏపీ ప్రజలు రెండు పార్టీల సంస్కృతికి కట్టుబడి, తమకి అలవాటైన డబ్బు, మద్యం, వర్గం ఆధారంగా ఓట్లు వేసి ఏక పార్టీకి గెలుపు కట్టబెట్టారు.

అదే సమయంలో జనసేన కోరుకున్న మార్పుకి ప్రజల నుంచి మద్దతు లభించిన అది ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకునే స్థాయిలో లేకపోవడంతో చాలా వరకు మూడో స్థానంకి జనసేన పరిమితం అయిపొయింది.

ఇక పోలింగ్ లో కూడా ప్రజలు వైసీపీకి ఏకంగా ఏకపక్ష విజయం కట్టబెట్టేసారు.

ఈ నేపధ్యంలో జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి అనే విషయం రాజకీయ వర్గాలలో చర్చకొచ్చింది.పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేసుకుంటాడని ప్రచారం జరిగింది.అయితే దానికి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ తాను పూర్తిగా రాజకీయాలకి పరిమితం అవుతానాని ఇకపై ప్రజలలోనే ఉంటానని స్పష్టం చేసాడు.అయితే జనసేన భవిష్యత్తు రాజకీయాలలో కీలకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్న ఆ పార్టీలో ఉన్న రాజకీయ నేతలు మాత్రం ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ అమరావతిలో పార్టీ నేతలతో సమీక్ష సమావేశం ఏర్పాటుకి సిద్ధం అయ్యారు.ఇక ఈ సమావేశానికి వచ్చే నేతలు బట్టి జనసేనలో ఉండేది ఎంత మంది పార్టీని వీడేది ఎంత మంది లెక్కలు తేలిపోయే అవకాశం ఉంది అనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube