బీజేపీ అధిష్టానానికి జనసేన సర్వే రిపోర్ట్ ? వీర్రాజే టార్గెట్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తున్నారు.రాజకీయాల్లో ఆవేశం పనికిరాదు అని, ఆలోచన కావాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లు గా వ్యవహరిస్తున్నారు.

 Jansena Party Has Sent A Report Bjp Supremancy-TeluguStop.com

ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల విషయంలో బిజెపి వ్యవహరిస్తున్న తీరుతో పవన్ అవమానానికి గురవుతూ వస్తున్నారు.ప్రజలలోను, సొంత పార్టీ నాయకులలోనూ తన తీరుపై ఆగ్రహం ఉందనే విషయాన్ని పవన్ సైతం గుర్తించారు.

కానీ ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీతో తెగతెంపులు చేసుకుని ముందుకు వెళితే, రాజకీయంగా మరింత వెనకబడిపోతాము అనే విషయాన్ని గ్రహించారు.అందుకే ఆ పార్టీతో సఖ్యతగా ఉంటూనే, తమ రాజకీయ ఎదుగుదలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసుకుంటున్నారు.

 Jansena Party Has Sent A Report Bjp Supremancy-బీజేపీ అధిష్టానానికి జనసేన సర్వే రిపోర్ట్ వీర్రాజే టార్గెట్ -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో పోటీ చేసి తీరాలని, జనసేన పార్టీ ఆశలు పెట్టుకుని ఉండగా, బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని, అది కూడా జనసేన సహకారంతో అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించినా, పవన్ ఇప్పటివరకు ఆ వ్యవహారంపై స్పందించలేదు.

కానీ ఇక్కడ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతుంది అనే సంకేతాలు ఇస్తూ, కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నారు.

అలాగే ఆ ఎన్నికలకు సంబంధించి కొత్తగా ఒక కమిటీని నియమించారు.వారి ద్వారానే తిరుపతి పార్లమెంటు పరిధిలో జనసేన, బిజెపి పార్టీల బలం ఎంత అనే దానిపైన సమగ్రంగా సర్వే చేయించి రిపోర్టును బిజేపి అధిష్టానానికి పంపించినట్లు తెలుస్తోంది.

ఆ రిపోర్ట్ లో ఎక్కువగా సోము వీర్రాజు వ్యవహారశైలిపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.ఆయన వ్యవహరిస్తున్న తీరుతో తాము ఎంత ఇబ్బంది పడుతున్నాము అనే విషయంతో పాటు, మరి కొన్ని అంశాల పైన నివేదిక రూపంలో పంపించినట్లు తెలుస్తోంది.

Telugu Amithsha, Ap, Bjp, Committe, Elections, Janasena, Jp Nadda, Modhi, Parlament, Report, Somu Veeraju, Tdp, Tirupathi, Ysrcp-Political

తిరుపతి ఎన్నికలలో ఏ వర్గం ఎవరికి మద్దతు ఇస్తుంది ? బిజెపి వైపు ఉండే వారు ఎంతమంది ? జనసేన వైపు ఎవరెవరు ఉంటారు ? బిజెపి పోటీ చేస్తే వారు మద్దతు ఇస్తారా ? ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరా ఇలా అనేక అంశాలపైనా వారం రోజులుగా చేసిన అధ్యయనం తాలూకా రిపోర్టును బిజెపి పెద్దలకు పంపించినట్లు తెలుస్తోంది.అంతిమంగా బిజెపికి ఇక్కడ గెలిచే అవకాశాలు తక్కువని, జనసేన మద్దతు దారులు కూడా బిజెపికి ఓటు వేసే అవకాశం లేదని, దీనంతటికీ కారణం సోము వీర్రాజు వ్యవహార శైలే అనే రిపోర్టు పంపించారట.అలాగే ఇటీవల తిరుపతి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పవన్ నియమించిన కమిటీ లోని కొంతమంది వ్యక్తులు మీడియా సమావేశం నిర్వహించి మరీ విమర్శలు గుప్పించారు.

అంతేకాదు వీర్రాజు చేసిన ప్రకటనలు అన్ని ఆయన వ్యక్తిగతమని , బీజేపీ కి సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు.

ముఖ్యంగా పొత్తు ధర్మం పట్టించుకున్నా, తిరుపతిలో బిజెపి జనసేన సహకారంతో పోటీ చేస్తుందని చెప్పడాన్ని జనసైనికులు ఆషామాషీగా తీసుకోవడం లేదు.అందుకే వీర్రాజు దూకుడుకు చెక్ పెట్టాలని జనసేన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బీజేపీ అధిష్టానానికి జనసేన అందించిన రిపోర్టుపై ఆ పార్టీ అగ్రనేతలు ఏ విధంగా స్పందిస్తా రో ? జనసేనకు ఏ హామీ ఇస్తారో ? తిరుపతి ఎన్నికలపై ఏ క్లారిటీ ఇస్తారో ?

.

#Somu Veeraju #Amithsha #Modhi #Janasena #JP Nadda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు