ఈ ఛానల్ వల్లే తాను ఈ స్థాయికి వచ్చా: జానీ మాస్టర్..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ లలో ఒకరిగా జానీ మాస్టర్ ఓ ఊపు ఊపేస్తున్నారు.వెండితెరపై మాస్ స్టెప్పులు వేస్తూ కొన్ని ఐకానిక్ మూమెంట్ లతో రచ్చ రచ్చ చేస్తున్నాడు మాస్టారు.

 Tollywood Famous Choreographer Jani Master Diwali Special Episode In Gemini Tv,-TeluguStop.com

కేవలం వెండితెరపై కనిపించే స్టెప్పులు వేయించడమే కాకుండా బుల్లితెరపై కూడా నవ్వులు పూయిస్తున్నాడు.ఢీ, అదిరింది, జబర్దస్త్ లాంటి షోలలో జానీ మాస్టర్ జడ్జిగా వెళ్లి అక్కడ చేసే సందడి అంత ఇంత కాదు.

ఈ మధ్యకాలంలో జానీ మాస్టర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది.బుల్లితెరపై కేవలం డాన్సులు మాత్రమే కాకుండా జానీ మాస్టర్ తన కామెడీ టైమింగ్, అలాగే ఆయన వేసే పంచ్ డైలాగులు కూడా కనిపిస్తాయి.

ఇకపోతే ఈయన ఇంత పాపులర్ కావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.అందులో మొదటిది ఆయన మెగా స్టార్ కి వీర అభిమాని కావడమే.అంతేకాకుండా మెగా హీరోలకు ఆయన అందించిన మాస్ స్టెప్పులు ఓ రేంజ్ లో వైరల్ కావడం.అలాగే మెగా హీరోలలో ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ లాంటి వారికి జానీ మాస్టర్ సిగ్నేచర్ స్టెప్పులను కంపోజ్ చేస్తూ ఆయన స్థాయిని రోజురోజుకు పెంచుకుంటున్నాడు.

ప్రస్తుతం ఆయన బుల్లితెర పై నాగబాబు తో కలిసి బొమ్మ అదిరింది షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఈ షోలో జానీ మాస్టర్ ఢీ కంటెస్టెంట్ పండు తో కలిసి అతను చేసే కామెడీ వేసే డాన్సులు బాగా వైరల్ అవుతున్నయి ఈ మధ్యకాలంలో.

ఇకపోతే ఈయన తాజాగా జెమిని ఛానల్ వారు దీపావళి సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొన్నాడు.మీకు మీరే మాకు మేమే అనే ఈ కార్యక్రమంలో అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టాడు.ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలోని ‘మేడిన్ ఆంధ్ర స్టూడెంట్’ అనే పాట ను ఎంచుకుని తనదైన స్టైల్ లో డాన్స్ ఇరగదీసాడు.ఆ ఫర్ఫార్మెన్స్ తర్వాత తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం అది జెమినీ టీవీ వల్లనేనని ఈ స్టేజి మీదనే మొట్టమొదటిసారిగా డాన్స్ స్టెప్పులు వేశానని చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube