బిగ్‌బాస్ కహానీ.. నేనూ అంటోన్న జానీ!

టాలీవుడ్‌లో బుల్లితెరపై రియాలిటీ షోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చుకున్న బిగ్‌బాస్ షో కోసం ప్రేక్షకుల ఆశగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ రియాలిటీ షో 4వ సీజన్‌కు రెడీ అయ్యింది.

 Choreographer Jani To Join Bigg Boss 4, Jani Master, Bigg Boss 4, Nagarjuna, Tol-TeluguStop.com

ఇప్పటికే ఈ షోకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా రావడంతో తాజాగా ఈ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ షోకు హోస్ట్‌గా అక్కినేని నాగార్జన మరోసారి వ్యవహరిస్తుండటంతో ఈ షోపై అంచనాలు పెరిగాయి.

కాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు నిర్వాహకులు.అయితే ఈ షోలో ఎవరు పాల్గొంటారు అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

కాగా ఈ షోలో పాల్గొనే వారిలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉన్నాడనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి క్రేజీ స్టార్స్‌కు ఎక్కువగా కొరియోగ్రాఫీ చేసే ఈ డ్యాన్స్ మాస్టర్ బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొనబోతున్నాడనే వార్తతో ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

కాగా ఈ షోలో ఇంకా చాలా మంది సెలెబ్రిటీలు ఉన్నారని, వారిలో ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే మాత్రం ఈ షో ప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube