"అమ్మ నన్ను బురదలో వదిలి వెళ్తా అనింది".! శ్రీదేవి గురించి ఝాన్వి సంచలన వ్యాఖ్యలు!       2018-05-31   00:48:28  IST  Raghu V

నిత్యం తన వెంటే ఉంటూ.. నటనలో ఓనమాలు నేర్పిస్తున్న అమ్మ అకస్మాత్తుగా దూరం కావడం ఆమెను బాధించింది. అన్నం తిననని మారం చేస్తే.. గోరు ముద్దలు తినిపించిన ఆ అమ్మ.. ఇక తిరిగి రాదనే బాధను ఆమె గుండెల్లోనే దాచుకుంది. ఆమెలాగే తానూ గొప్పనటిగా గుర్తింపు తెచ్చుకుని ఆ ‘అమ్మ’కు కానుకగా ఇవ్వాలని పరితపిస్తోంది.

ఆమే.. జాన్వీ కపూర్. ప్రముఖ నటి శ్రీదేవి పెద్ద కుమార్తె. ఆమె తొలిసారిగా ‘వోగ్’ మ్యాగ్‌జైన్‌కు కవర్ పేజీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. ప్రతి రోజు అమ్మ శ్రీదేవిని మిస్ అవుతున్నానని, చిన్న చిన్న పనులకు కూడా తాను అమ్మ మీదే ఆధారపడేదానినని చెప్పింది. తాను పడుకోవాలన్నా.. అమ్మను నిద్రపుచ్చమని కోరేదానినని, ఏదైనా తినాలనిపిస్తే అమ్మనే తినిపించాలని మారం చేసేదానినని తెలిపింది. ఇప్పుడు ఆ బాధ్యత తన చెల్లి కుషీ చూసుకుంటోందని పేర్కొంది.

-

ఆసక్తికర విషయం ఏమిటంటే.. శ్రీదేవికి తన కుమార్తె జాన్వీ సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. ఈ విషయం జాన్వీయే తెలిపింది. తన అమాయకత్వం సినీ రంగానికి సరిపోదాని, తాను నెగ్గుకురాలేనని అమ్మ భావించేందని జాన్వీ తెలిపింది. జాన్వీకి బదులు చిన్న కుమార్తె కుషీని సినిమాల్లోకి పరిచయం చేయడానికే ఆమె ఇష్టపడేదని తెలిపింది. అయితే, తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి ని కాదనలేక అమ్మ ఒప్పుకుందని పేర్కొంది. అనంతరం లాస్ ఏంజిలెస్‌లోని యాక్టింగ్ స్కూల్‌లో జాన్వీని చేర్పించింది. ఈ సందర్భంగా శ్రీదేవి.. ‘‘పువ్వులాంటి నా చిట్టితల్లిని.. బురదలో వదిలి వెళ్లిపోతున్నా’’ అని వ్యాఖ్యానించిందని జాన్వీ తెలిపింది.

-