పనికిమాలిన సలహాలొద్దు అంటూ మీడియాపై జాన్వీ కపూర్ ఫైర్?

బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈమె సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

 Janhvi Kapoor Shouts On Media For Giving Wrong Advice Details,  Jhanvi Kapoor, B-TeluguStop.com

ఈ క్రమంలోనే జాన్వి కపూర్ తన తండ్రితో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో కనిపించగా కెమెరాలు వారి పై ఫోకస్ చేశాయి.ఇలా ఫోటోగ్రాఫర్స్ వీరిద్దరి ఫోటోను కలిసి తీయడం కోసం ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే బోనికపూర్ జాన్వి ఇద్దరు మాస్క్ పెట్టుకోవడంతో బోనీ కపూర్ ను మాస్క్ తీయాలనికొందరు చెప్పడంతో అందుకు బోనికపూర్ మాస్కు తీస్తుండగా జాన్వికపూర్ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి పనికిమాలిన సలహాలు వద్దంటూ తన తండ్రికి తిరిగి మాస్క్ తోడిగింది.ప్రస్తుతమున్న ఇలాంటి పరిస్థితులలో మాస్కు తీయడం ముఖ్యం కాదంటూ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన జాన్వి తిరిగి తన తండ్రికి మాస్క్ తొడిగినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె కేరింగ్ చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలాంటి కూతురు ప్రతి ఒక్క తండ్రికి ఉండాలంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సోషల్ మీడియా వేదికగా నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ జాన్వీకపూర్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube