శ్రీదేవి వర్థంతి సందర్భంగా తల్లి రాసిన లెటర్ షేర్ చేసిన జాన్వీ..

శ్రీదేవి ఈ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కోట్లాది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.బాలనటిగా అడుగుపెట్టి హీరోయిన్ గా సీనియర్ హీరోలందరితో ఆడిపాడింది.

 Janhvi Kapoor Shares Note From Mom Sridevi On Her Death Anniversary-TeluguStop.com

ఈ రోజు అతిలోక సుందరి శ్రీదేవి మూడవ వర్ధంతి.ఆమె చనిపోయి మూడు సంవత్సరాలవుతున్నా ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయింది.

తెలుగులో పదహారేళ్ళ వయసు సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.ఆ తరువాత శ్రీదేవి వెనక్కి తిరిగి చూసుకోలేదు.తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా నటించి రెండు దశాబ్దాల పాటు అగ్ర హీరోయిన్ గా కొనసాగింది.శ్రీదేవి హీరోయిన్ గా మంచి జోరు మీద ఉన్న సమయంలోనే 1996 లో బోనీకపూర్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది.

 Janhvi Kapoor Shares Note From Mom Sridevi On Her Death Anniversary-శ్రీదేవి వర్థంతి సందర్భంగా తల్లి రాసిన లెటర్ షేర్ చేసిన జాన్వీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.చాలా రోజుల విరామం తర్వాత మళ్ళీ శ్రీదేవి ఇంగ్లిష్‌ వింగ్లిష్‌ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

శ్రీదేవికి కూతుళ్లను హీరోయిన్స్ చేయాలని కోరిక.అయితే తన కోరిక తీరక ముందే ఆమె మరణించింది.తన మరణ వార్తతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.2018 సంవత్సరం ఫిబ్రవరి 24 న శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.ఒక వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి హోటల్ గదిలో బాత్‌ట‌బ్‌లో ప‌డి చనిపోయింది.

తన తల్లి మరణించి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా జాన్వీ కపూర్ ఆమెను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది.

ఆ లెటర్ స్వయానా శ్రీదేవి జాన్వీ కపూర్ కోసం తన చేతులతో రాసింది.అందులో శ్రీదేవి ఐ ల‌వ్యూ మై ల‌బ్బూ.నువ్వు ఈ ప్ర‌పంచంలోనే గొప్ప బేబివి అని రాసి ఉంది.

ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు కూడా మిస్ యు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

జాన్వీ కపూర్ మొదటి సినిమా చేస్తున్న సమయంలోనే తల్లి మరణించడంతో ఆ బాధలోనే ఆ సినిమాను పూర్తి చేసింది.ప్రస్తుతం హిందీలో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

https://www.instagram.com/p/CLqdVKllCAa/?utm_source=ig_embed
#Sridevi #Janhvi Kapoor #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు