జాన్వీ కపూర్ కు ఇలాంటి అబ్బాయే కావాలట.. ఈ క్వాలిటీస్ ఉంటే చాలు?

దివంగత నటి,అతిలోక సుందరి అయిన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి మనందరికీ తెలిసిందే.శ్రీదేవి కూతురు గా ఎంట్రీ ఇచ్చిన జాన్వికపూర్ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

 Janhvi Kapoor Reveals Best Qualities She Wants In Her Future Partner, Jhanvi Kap-TeluguStop.com

జాన్వీ కపూర్ కెరిర్ పరంగా ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.తరచూ సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను,ఫొటోలను, అలాగే తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అంతే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఇకపోతే శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

కాగా బాలీవుడ్‌లో అత్యంత పాపులర్ స్టార్ కిడ్స్‌లో జాన్వీ కపూర్ ఒకరు.మొదట జాన్వికపూర్ ధకడ్ ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మొదటి సినిమాతోనే అందం అభినయం నటన తో మంచి మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తరువాత గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్,ఘోస్ట్ స్టోరీస్ లాంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకుంది.ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ తాజాగా నటించిన చిత్రం గుడ్‌లక్ జెర్రీ.తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ కొలమావు కోకిల సినిమాకు రీమేక్ గా తెరకేక్కింది.

ఇక ఈ సినిమాకు సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాకు నిర్మాతగా వివరించారు.

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూలై 29న విడుదల కానుంది.ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ బిజీబిజీగా గడుపుతోంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి తెలిపింది.ఈ సందర్భంగా జాన్వి కపూర్ మాట్లాడుతూ.

అతను నిజంగా ప్రతిభావంతుడై ఉండి, అతను గోల్స్‌ పై ఎంతో మక్కువ కలిగి ఉండాలని, అతనితో ఉన్నప్పుడు నాలో ఉత్సాహం రావాలి.అలాగే అతని నుంచి ప్రతి రోజూ ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి.

Telugu Bollywood, Jhanvi Kapoor, Sri Devi, Kid-Movie

అలాగే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా ముఖ్యం.అన్నింటి కన్నా ముఖ్యంగా నేనంటే పడి చచ్చిపోవాలి అంటూ తనకు కాబోయే వాడికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.ఇకపోతే ప్రస్తుతం జాన్వీ కపూర్ వరుణ్ ధావన్‌తో బావాల్, రాజ్‌కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్ మహి,సన్నీ కౌశల్‌తో మిలీ, అలాగే మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో బిజీబిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube