జాన్వీ కపూర్( Janhvi Kapoor ) శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్నారు.ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం సౌత్ సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు.
జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్( NTR ) హీరోగా నటిస్తున్న దేవర ( Devara ) సినిమాలో నటిస్తున్నారు.అలాగే రామ్ చరణ్( Ramcharan ) బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉండే ఈమె తన వ్యక్తిగత విషయాల ద్వారా తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటారు.జాన్వీ కపూర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా ( Shikhar paharia ) అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.అంతేకాకుండా పలు సందర్భాలలో వీరిద్దరూ కలిసి మీడియా కంట పడటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరూ భావించారు కానీ ఈ విషయాన్ని మాత్రం ఈమె తెలియజేయలేదు.
ఇకపోతే తన ప్రియుడు శిఖర్ అని తనతో ఈమె ప్రేమలో ఉన్నాననే విషయాన్ని చెప్పకనే చెప్పారు.తన తండ్రి బోణీ కపూర్ ( Boney Kapoor ) నిర్మించిన మైదాన్ సినిమా స్క్రీనింగ్ జాన్వీ కపూర్ హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ఈమె వైట్ కలర్ సూట్ ధరించి ఒక డైమండ్ చైన్ మెడలో వేసుకొని వచ్చారు.
అయితే ఆ డైమండ్ చేంజ్ పై తన ప్రియుడు శిఖర్ పేరు ఉండడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.ఇలా తన ప్రియుడు పేరు ఉన్నటువంటి డైమండ్ నెక్లెస్ వేసుకొని రావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.