శ్రీదేవి కూతురుకు చేదు అనుభవం.. అడ్డుకున్న రైతులు..?  

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొత్త వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.ఈ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది అన్నదాతలు ఆందోళనలు చేపట్టారు.

TeluguStop.com - Janhvi Kapoor Movie Shoot Faces Farmers Protest Punjab

రైతుల ఆందోళనల గురించి కొంతమంది సెలబ్రిటీలు స్పందించి తమ అభిప్రాయాలను తెలియజేయగా మరి కొంతమంది సెలబ్రిటీలు మాత్రం రైతుల ఆందోళనల గురించి స్పందించలేదు.

అయితే సినిమా సెలబ్రిటీలకు దేశంలోని పలు ప్రాంతాల్లో రైతుల నిరసన సెగ తగులుతోంది.

TeluguStop.com - శ్రీదేవి కూతురుకు చేదు అనుభవం.. అడ్డుకున్న రైతులు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బాలీవుడ్ నటి, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమా ” గుడ్ లక్ జెర్రీ ” సినిమా షూటింగ్ కోసం పంజాబ్ కు వెళ్లగా అక్కడ రైతులు షూటింగ్ ను అడ్డుకోవడంతో పాటు రైతుల ఆందోళనలకు మద్దతు పలకాలని జాన్వీ కపూర్ ను కోరారు.ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా షూటింగ్ ను రైతులు అడ్డుకున్నారు.

పంజాబ్ రాష్ట్రంలోని బస్సీ పఠానా ప్రాంతంలో జాన్వీ కపూర్ ను రైతులు మద్దతు పలకాలని కోరగా ఆమె చివరకు మద్దతు పలకడంతో రైతులు అక్కడినుండి వెళ్లిపోయారు.జాన్వీ మద్దతు తెలిపిన తరువాత షూటింగ్ యధాతథంగా కొనసాగింది.గుడ్ లక్ జెర్రీ మూవీ నిర్మాత ఈ నిరసన సెగ గురించి మాట్లాడుతూ కీలకవ్యాఖ్యలు చేశారు.రైతుల ఆందోళనల గురించి సెలబ్రిటీలు మౌనం వహిస్తుండటంతో అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారని నిర్మాత పేర్కొన్నారు.

జాన్వీపై రైతులకు ద్వేషం లేదని వాళ్లు కేవలం మద్దతు పలకాలని మాత్రమే కోరారని నిర్మాత తెలిపారు.రైతులకు మద్దతు పలికిన తర్వాత జాన్వీ సోషల్ మీడియాలో రైతులకు సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు.

ఇప్పటికే గుడ్ లక్ జెర్రీ ఫస్ట్ లుక్ విడుదల కాగా ఆ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమైన సంగతి తెలిసిందే.

#Punjab #Jhanhavi Kapoor #Farmers Protest #Good Luck Jerry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Janhvi Kapoor Movie Shoot Faces Farmers Protest Punjab Related Telugu News,Photos/Pics,Images..