బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ మరోసారి వార్తల్లో నిలిచింది.హీరోయిన్ గా ఈ అమ్మడు బాలీవుడ్ లో ఇప్పటి వరకు మినిమం సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది.
అయినా కూడా హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.తన హాట్ ఫొటోలతో పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తున్న ఈ అమ్మడు తాజాగా ఒక కోలీవుడ్ సినిమాకు సైన్ చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది అంటూ కూడా తమిళ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరిగింది.కానీ అసలు విషయం ఏంటీ అంటే ఏ ఒక్క తమిళ ఫిల్మ్ మేకర్ కూడా ఇప్పటి వరకు జాన్వీ కపూర్ ను సంప్రదించలేదట.
ఈ విషయాన్ని స్వయంగా జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ వెళ్లడించాడు.తాను నిర్మిస్తున్న తమిళ సినిమాల్లో కూడా జాన్వీ నటించడం లేదు అంటూ స్పష్టత ఇచ్చాడు.
పెద్ద ఎత్తున జాన్వీ కపూర్ కు తమిళం నుండి ఆఫర్లు వస్తున్నాయి అనేది కేవలం పుకార్లు మాత్రమే అని తేలిపోయింది.

మరో వైపు తెలుగు ఫిల్మ్ మేకర్స్ మాత్రం పదే పదే ఆమె ను సంప్రదిస్తున్నారు.ఇప్పటికే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు జోడీగా ఆమెను నటింపజేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా సమాచారం అందుతోంది.హీరోయిన్ గా జాన్వీ కపూర్ యొక్క కెరీర్ ఏమాత్రం సాఫీగా సాగడం లేదు.
అందుకే తమిళ ఫిల్మ్ మేకర్స్ ఆమెను పట్టించుకోవడం లేదు.

కానీ తెలుగు ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఆమె పై తెగ మోజు పడుతున్నారు.జాన్వీ కపూర్ పై ఉన్న ఆసక్తి తో తెలుగు ఫిల్మ్ మేకర్స్ భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్దం అంటున్నారు.తమిళంలో మాత్రం ఈమెకు ఆఫర్లు రావడం లేదు.
హిందీలో అడపా దడపా చిన్న సినిమా లు చేస్తూ ఉంది.తెలుగు లో మాత్రమే స్టార్ హీరోలకు జోడీగా సినిమా లను చేసేందుకు రెడీ అయ్యింది.
మన వాళ్లు జాన్వీ అంటే తెగ మోజు పడుతున్నారు అనేందుకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం.
