లేటెస్ట్ బజ్ : మహేష్ త్రివిక్రమ్ కాంబోలో హీరోయిన్ గా జాన్వీ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఆ వార్తలు నిజమేనని ఈ మధ్యే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

 Janhvi Kapoor In Trivikram Mahesh Babu Movie-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ కోసం త్రివిక్రమ్ సర్చింగ్ మొదలు పెట్టాడట.ఇప్పటికే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ లిస్టులో చాలా మంది పేర్లు వినిపించాయి.

మహేష్ సరసన పూజా హెగ్డే, రష్మిక మందన్న, కియారా పేర్లు వినిపించాయి.మహేష్ ఇంతకు ముందే వీరితో సినిమాలు చేసాడు.అందుకే త్రివిక్రమ్ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నట్టు సమాచారం.కొత్త పెయిర్ అయితే సినిమా మీద మరింత ఆసక్తి పెరుగుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.

 Janhvi Kapoor In Trivikram Mahesh Babu Movie-లేటెస్ట్ బజ్ : మహేష్ త్రివిక్రమ్ కాంబోలో హీరోయిన్ గా జాన్వీ..-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే మహేష్ కోసం బాలీవుడ్ బ్యూటీ ను లైన్లో పెడుతున్నట్టు లేటెస్ట్ టాక్.

Telugu Janhvi Kapoor, Janhvi Kapoor In Trivikram Mahesh Babu Movie, Mahesh Babu, Trivikram Srinivas-Latest News - Telugu

మహేష్ బాబు సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను సెట్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం.ఈ సినిమాను నిర్మించే హాసిని హారిక బ్యానర్ జాన్వీ కపూర్ ను మహేష్ బాబు కు జంటగా నటింప చేయాలనీ కసరత్తులు మొదలు పెట్టారట. ఆమె నుండి ఎలాగైనా గ్రీన్ సిగ్నల్ పొందాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుందట.

చూడాలి మరి జాన్వీ కపూర్ మహేష్ సినిమాతో నైనా తెలుగులో అడుగుపెడుతుందో లేదో.

ఇది ఇలా ఉండగా మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

#Janhvi Kapoor #JanhviKapoor #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు