బాలీవుడ్ లో జాన్వీ స్పీడ్ చూస్తుంటే ఇప్పట్లో సౌత్ కష్టమే

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాతోనే నటిగా ప్రూవ్ చేసుకొని వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ అమ్మడు తరువాత రెగ్యులర్ హీరోయిన్స్ తరహాలో కాకుండా కొత్తదనం ఉన్న పాత్రలు చేస్తూ తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకునే దిశగా దూసుకుపోతుంది.

 Janhvi Kapoor Dont Have A Space To Entry In South-TeluguStop.com

ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలలో చాలా వరకు ఇండిపెండెంట్ పాత్రల్లోనే చేస్తుంది.హీరోలతో రొమాన్స్ చేసే పాత్రలు లేవనే చెప్పాలి.

గత ఏడాది గుంజన్ సక్సేనా సినిమాతో ఈ భామ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.అలాగే దోస్తానా 2లో నటించింది.

 Janhvi Kapoor Dont Have A Space To Entry In South-బాలీవుడ్ లో జాన్వీ స్పీడ్ చూస్తుంటే ఇప్పట్లో సౌత్ కష్టమే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రెండు సినిమాలు పర్వాలేధనిపించుకున్నాయి.ఇక ప్రస్తుతం రోహి అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇందులో జాన్వీ కపూర్ దెయ్యం ఆవహించిన అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.

తక్త్ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుంది.తండ్రి నిర్మాణంలోనే బోంబే గర్ల్ అనే సినిమా చేయబోతుంది.ఈ సినిమా ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది.

ఇలా వరుస సినిమాలు ఈ అమ్మడు హిందీలో సైన్ చేసేసింది.దీంతో గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒక సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

అయితే జాన్వీ కపూర్ ని సౌత్ కి తీసుకురావాలని చాలా మంది దర్శక, నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు.అయితే ప్రస్తుతం ఆమె సినిమాలు లిస్టు చూస్తూ ఉంటే ఇప్పట్లో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తుంది.

ఒక వేళ ఉంటే వచ్చే ఏడాది మాత్రమే ఛాన్స్ ఉంటుంది.అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీని తీసుకురావాలని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది.

ఏది ఏమైనా సౌత్ ప్రేక్షకులని జాన్వీ ఇప్పట్లో పలకరించడం కష్టమే అనే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

#Sridevi #Janhvi Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు