ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని అంటున్న జాన్వీ కపూర్

శ్రీదేవి కూతురుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా ధఢక్ తోనే తనని తాను ప్రూవ్ చేసుకున్న నటి జాన్వీ కపూర్.ప్రస్తుతం ఈ అమ్మడు రెండో సినిమా గుంజన్ సక్సేనా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.

 Jhanvi Kapoor Accepts Her Privilege, Bollywood, Nepotism, Heroism, Sridevi Daugh-TeluguStop.com

ఇండియన్ ఫస్ట్ ఎయిర్ ఫైటర్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జాన్వీ కపూర్ తన కెరియర్ గురించి ఆసక్తికరమైన వాఖ్యలు చేసింది.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటులు కావాలని ప్రయత్నం చేస్తున్న వారు అనేక అవరోధాలు ఎదుర్కొని ముందుకి రావాలని, బాలీవుడ్ లో చాలా మంది మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు తనకి ఎదురుకాలేదని జాన్వీ చెప్పింది.దీనికి కారణం తాను సినీ ఫామిలీ బ్యాగ్రౌండ్ నుంచి రావడమే కారణం అని, ఈ కారణం వలనే తనకి అవకాశాలు కూడా వేగంగా వచ్చాయని పేర్కొంది.

ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తానని జాన్వీ కపూర్ ఒప్పుకుంది.ఇక దర్శకులు కథలు చెప్పేటప్పుడు ఎక్కువగా హీరోలని దృష్టిలో ఉంచుకొని చెబుతారని, అయితే హీరోల పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అలా చెబుతారని భావించానని, అయితే నిజానికి అలా కథలని హీరోల చుట్టూ తిప్పడం దర్శకులకి అలవాటుగా మారిపోయిందని ఆలస్యంగా తెలుసుకున్నానని చెప్పింది.

హీరోయిజం కేవలం హీరోలతోనే ఎందుకు చూస్తారో తనకి ఇప్పటికి అర్ధం కావడం లేదని జాన్వీ కపూర్ వాఖ్యానించింది.ఈ వాఖ్యల ద్వారా చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువగా ఉందని జాన్వీ కపూర్ పరోక్షంగా చెప్పినట్లు అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube