జనతా కర్ఫ్యూ తో మంత్రులంతా ఇళ్లల్లోనే....  

%%title%% Janata Curfew, Covid19 Ministers - Telugu Covid19, Janata Curfew, March 31st, Narendra Modi, Telangana Minsters Home

కరోనా ప్రభావం తో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిన్న(ఆదివారం) జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.దీనితో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ జనతా కర్ఫ్యూ ని పాటించారు.

%%title%% Janata Curfew Covid19 Ministers - Telugu Covid19 March 31st Narendra Modi Telangana Minsters Home

ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఈ జనతా కర్ఫ్యూ కి మద్దతు తెలపాలి అంటూ ప్రధాని పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలు సమర్ధవంతంగా ఈ కర్ఫ్యూ కు మద్దతు తెలిపారు.ఈ క్రమంలోనే తెలంగాణా సర్కార్ మరో అడుగు ముందుకు వేసి మొత్తం 24 గంటల పాటు ఈ జనతా కర్ఫ్యూ పాటించాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం, ఆ ఆదేశాలను తెలంగాణా ప్రజలు పాటించారు.

ఈ క్రమంలోనే తెలంగాణా మంత్రులు కూడా ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది.ఎప్పుడూ బిజీగా ఉండే మంత్రులు అందరూ కూడా కర్ఫ్యూ లో భాగంగా ఇంటిలోనే ఉండిపోవడం తో వారికి కుటుంబం తో గడిపే అవకాశం లభించింది.

%%title%% Janata Curfew Covid19 Ministers - Telugu Covid19 March 31st Narendra Modi Telangana Minsters Home

రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆదివారం అంతా తన మనవడితో గడిపారు.

ఇక పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కూడా ఆదివారం తన కుటుంబ సభ్యులతో ఇంటిలోనే తోటపని చేశారు.

ఇక తెలంగాణా ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా తన కుటుంబంతో ఇంట్లోనే ఉన్నారు.ఈ సందర్భంగా ఆయన తన భార్య, కూతురుతో కలిసి ఓ సెల్ఫీ వీడియోను కూడా తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు.

జనతా కర్ఫ్యూను విజయం చేసిన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.పోలీసులను పెట్టిన విజయవంతం కాని కర్ఫ్యూలు.ఇప్పుడు పోలీసుల గస్తీ లేకున్నా ప్రజలు కర్ఫ్యూను విజయవంతం చేశారంటూ మెచ్చుకున్నారు.

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గాడ్ తన మనవాళ్ళు, మానవరాళ్లతో కలిసి గడుపుతున్నారు.అలానే సెలబ్రిటీలు అందరూ కూడా ఈ జనతా కర్ఫ్యూ కు తమ మద్దతు తెలిపి ఈ జనతా కర్ఫ్యూ ని పాటించారు.ఈ క్రమంలో యువ నటుడు నాగ‌ శౌర్య త‌న త‌ల్లికి సహాయం చేస్తూ ఆవ‌కాయ ప‌చ్చ‌డి ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు.

దీనికి సంబందించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.నాగ శౌర్య సినిమాల విషయానికి వస్తే.ఈ కుర్ర హీరో ఇటీవ‌ల అశ్వ‌థ్థామ చిత్రంతో ప్రేక్ష‌కుల‌కి ముందు వ‌చ్చిన సంగతి తెలిసందే.ప్రస్తుతం తన త‌దుప‌రి ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయనున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

Janata Curfew Covid19 Ministers Home Related Telugu News,Photos/Pics,Images..