జనసేన బీజేపీ కలవబోతున్నట్టేనా ? ప్రకటన ఎప్పుడో ?

ఏపీలో ప్రస్తుతం బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తున్నా 2024 ఎన్నికల నాటికి అధికారం దక్కించుకునే అంత స్థాయిలో బలపడే ఛాన్స్ అయితే లేదు.ఎందుకంటే ఆ పార్టీలోకి బలమైన నాయకులూ చేరినా క్షేత్ర స్థాయిలో బీజేపీ వైపు చూసే వారు చాలా తక్కువ.

 Janasenaparty Mergein Bjp-TeluguStop.com

అలాగే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కుంటోంది.రాజకీయంగా పవన్ కు అనుభవం లేకపోవడం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో విఫలం అవ్వడం వంటి కారణాల వల్ల ఆ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజాన్ని మూటగట్టుకుంది.

ప్రస్తుతం ఈ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని చూస్తున్నాయి.

అయితే ఎవరికి వారు విడివిడిగా పోటీ చేస్తే లాభం ఉండదని , కలిసి ముందుకు వెళ్తేనే అధికారం దక్కించుకునే ఛాన్స్ ఉంటుందనే ఆలోచనకు వచ్చినట్టు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చిగురించే అవకాశం కనిపిస్తోంది.దీనికి బలం చేకూర్చేలా జనసే అధినేత పవన్ కల్యాణ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలి భేటీలో జాతీయ పార్టీలు రమ్మంటున్నాయి.

ఎవరితో కలిసి వెళ్లినా లౌకిక పంధాను మాత్రం వీడేది లేదంటూ చెప్పుకొచ్చారు.అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీలతో పాటు మరికొన్ని కమిటీలను నియమించారు.

పీఏసీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.ఎందుకంటే పవన్ అమెరికాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో చర్చలు జరిపారు.అప్పటి నుచి ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.అప్పట్లో పవన్ ఈ వార్తలు ఖండించినా ఇప్పుడు మాత్రం అవి నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

-Telugu Political News

జనసేన బీజేపీ పొత్తు ద్వారా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా రెండు పార్టీల నేతల్లోనూ కనిపిస్తోంది.వాస్తవంగా జనసేనను బీజేపీలో వీలనం చేసుకోవాలని చూసారు.2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి మంచి ఫలితాలను సాధించిన తర్వాత బీజేపీ చీఫ్ అమిత్ షా నుంచే పవన్ కల్యాణ్‌కు ఆఫర్ వచ్చింది.దేశంలో ప్రాంతీయ పార్టీలకు చోటు లేదని జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని కోరారట.

ఇదే విషయాన్ని పవన్ చాలా సార్లు చెప్పారు.అమెరికాలో రామ్‌మాధవ్ కూడా.

ఇదే ప్రతిపాదన పెట్టారని.పీఏసీ మీటింగ్‌లో పవన్ కల్యాణ్ పరోక్షంగా చెప్పారు.

జాతీయ పార్టీలు రమ్మంటున్నాయి కానీ.తాను జనసేనను విలీనం చేసే ప్రసక్తే లేదంటూనే పొత్తు విషయంలో అభ్యంతరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు.

త్వరలోనే బీజేపీ జనసేన పార్టీల పొత్తు గురించి అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీ నాయకులూ గుసగుసలాడుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube