గాజువాకని పవన్ కళ్యాణ్ అందుకే పక్కన పెట్టాడా

ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు కార్యాచరణని సిద్ధం చేసుకొని ఇప్పటికే దానిని ఆచరణలో పెట్టాడు.ఎవరు ఎన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్న తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు.

 Janasenachiefpawan Kalyan Avoidgajuwaka-TeluguStop.com

సోషల్ మీడియా, ఇతర మీడియాలలో పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వెళ్ళిపోతాడు అని ప్రచారం చేస్తూ ఉన్న వాటిని పట్టించుకోకుండా జనసేన ఉనికి చాటే ప్రయత్నం చేస్తున్నాడు.అందులో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను ఓడిపోయినా భీమవరం నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టి విశాఖలో గాజువాకని కాస్తా పక్కన పెట్టాడు.

అయితే గాజువాక నియోజక వర్గాన్ని పవన్ కళ్యాణ్ వదులుకోవడానికి కారణం అక్కడ జనసేన బలంగా ఉన్న ఎక్కువగా స్థానికతకి ప్రాధాన్యం ఇస్తారు.స్థానికంగా ఉండి ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తినే ఎక్కువగా గాజువాక ప్రజలు పట్టం కడతారు.

సామాజిక సమీకరణాల ఆధారంగా చూసుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ వర్గం ఎక్కువగా ఉన్న గత ఎన్నికలలో మూడో స్థానానికి పరిమితం అయిపోయాడు.దానితో పోల్చుకుంటే భీమవరం కొంతలో కొంత పరవాలేదని చెప్పాలి.

అయితే గాజువాకలో స్థానికంగా బలమైన నేతని రంగంలోకి దించి గోదావరి జిల్లాల మీద పూర్తి స్థాయిలో ద్రుష్టి పెట్టి సంస్థాగతంగా పార్టీని బలంగా తయారు చేయాలని జనసేనాని వ్యూహంగా కనిపిస్తుంది.అయితే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా జనసేన ఎంత వరకు గ్రామ స్థాయిలో బలపడుతుంది అనే విషయం తెలిసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube