అతిసామాన్యుడి గా చిన్నహోటల్ లో బస చేసిన పవర్ స్టార్

సాధారణంగా కొంచం ఫేమస్ అయిన వారు హోటల్ లో బస చేయాల్సి వస్తే హోటల్ గదిలో ఏసీ ఉందా, లేదా వాటర్ హీటర్ ఉందా అంటూ తెగ వెతుక్కుంటూ ఉంటారు.అలాంటిది తన ఒక్క చూపు,ఒక్క మాట తో జనాల్లో ప్రభంజనం సృష్టించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి నేతలు హోటల్ లో బస చేయాల్సి వస్తే ఇక ఎలాంటి రూమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

 Janasenachief Pawan Kalyan Stay Atanasram Inharidwar-TeluguStop.com

కానీ ఎలాంటి ఆడంబరాలు పోకుండా అతి సామాన్యుడి గా ఒక చిన్న పాటి హోటల్ గదిలో ఆయన బస చేయడం విశేషం.ఎప్పుడూ తన సింపుల్ సిటీ తో అందరినీ ఆశ్చర్యపరిచే పవన్ మరోసారి కూడా సాధారణ హోటల్ లో బస చేసి తన సింపుల్ సిటీ ని చాటుకున్నాడు.

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల లైఫ్ స్టైల్ మామూలుగా ఉండదు.అలాంటి జనసేన పార్టీ చీఫ్, నటుడు పవన్ కల్యాణ్‌కు ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికి ఆయన మాత్రం సామాన్యుడిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.

తాజాగా పవన్ కల్యాణ్ గంగానది ప్రక్షాళన అంశం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.ఈ నేపథ్యంలో ఉత్తర భారతంలో పర్యటించి గంగానది తీరుతెన్నులు ప్రత్యేకంగా పరిశీలించి తెలుసుకోవాలని హరిద్వార్ వెళ్లారు.

ఈ క్రమంలో ఆయన స్టే చేసిన హోటల్ రూంకు సంబంధించిన ఫోటోలు జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.

అంతటి ఫెమస్ అయిన వ్యక్తి ఇలా సామాన్య హోటల్ లో బస చేయడం పై అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Telugu Anasena Pawan, Asram, Haridwar, Janasena, Pawan Kalyan, Pawankalyan-Telug

  సమాజం, పర్యావరణం పట్ల ఎంత పవన్ కల్యాణ్‌కు ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అందుకే హరిద్వార్ వెళ్లిన ఆయన అక్కడి పవన్ ధామ్ ఆశ్రమంలో బస చేశారు.తాను ఓ సెలబ్రిటీ అయినా ఎంతో సాదాగా ఉన్న గదిలో గడిపారు.

అయితే ఆ గది చాలా సింపుల్‌గా ఉంది.అందులో ఓ బెడ్ తప్ప మరేమీ లేకపోవడం విశేషం.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube