ఏపీ రాజ‌కీయాల్లో ఆశావాదంగా మారుతున్న జ‌న‌సేన‌.. ప‌వ‌న్ ఇక‌నైనా జోరు పెంచుతారా..?

రాజ‌కీయాల్లో కొంద‌రికి మాత్ర‌మే అన్ని ర‌కాల అవ‌కాశాలు, అదృష్టాలు ఉంటాయి.కొత్తగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వారి గురించి ప్ర‌జ‌ల‌కు బాగా తెలిసి ఉంటేనే వారు రాణించ‌గ‌లుగుతారు.

 Janasena, Who Is Becoming Optimistic In Ap Politics. Will Pawan Continue To Push-TeluguStop.com

ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని వారికి ఇక్క‌డ రాణించాలంటే క‌త్తిమీద సాము లాంటిదే.కానీ ప‌వ‌న్ కల్యాణ్‌కు అలాంటి అవ‌స‌రం లేదు.

ఆయ‌న మొద‌టి నుంచి ప‌వ‌ర్ స్టార్‌గా ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడే.ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగే అయన‌కు జ‌న‌సైనికుల‌ను తెచ్చి పెట్టింది.

ఒక క‌మిట్ మెంట్‌తో ప‌నిచేసే కార్య‌క‌ర్త‌ల‌ను ఆయ‌న పార్టీకి ఇచ్చింది.ఇది ఆయ‌నకు బాగా క‌లిసి వ‌చ్చే అంశం.

ఆయ‌న అంత దారుణంగా గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా కేడ‌ర్ మాత్రం జ‌న‌సేన‌ను విడిచి ఎక్క‌డ‌కూ వెళ్ల‌లేదు.మ‌రింత ఉత్సాహంగా ప‌నిచేస్తూనే ఉంది.అయినా ప‌వ‌న్ మాత్రం వీరికి పూర్తి స్థాయిలో అండ‌గా నిల‌బ‌డ‌లేక‌పోతున్నార‌ని వారి వాద‌న.ఆయ‌న ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే వ‌స్తార‌ని మిగ‌తా స‌మ‌యంలో వారికి దిశా నిర్దేశం చేయ‌ట్లేద‌ని అంటున్నారు.

కానీ ప‌వ‌న్ ఎలాంటి ఆదేశాలు పెద్ద‌గా ఇవ్వ‌క‌పోయినా తామంత‌ట తామే వ‌రుస స్థానిక, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పోటీ చేసి జనసైనికులు మంచి విజ‌యాన్నే సాధించారు.ప‌వ‌న్ ఎలాంటి ప్ర‌చారం చేయ‌క‌పోయినా వారు అన్ని సీట్లు గెలిచారంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి.

Telugu Ap Potics, Janasena, Muncipal, Pawan, Tdp, Ys Jagan, Ysrcp-Telugu Politic

ఇక మొన్న జ‌రిగిన మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో కూడా పవన్ ప్రచారం లేదు.కానీ జ‌న‌సైనికులు బాగానే సీట్లు గెలుచుకున్నారు.ఇలా వ‌రుస ఎన్నిక‌ల్లో జ‌న‌సేన స్పీడును చూస్తుంటే జ‌నాలు దీన్ని ఒక ఆశావాదంగానే చూస్తున్నారు.కానీ ముందుండి న‌డిపించే నాయ‌కుడు ప‌వ‌న్ మాత్రం అంద‌రినీ నిరాశ‌కు గురి చేస్తోంది.

ఆయ‌న నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండి కార్య‌క‌ర్త‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు మీటింగులు పెడ‌తూ దిశా నిర్దేశం చేస్తూ ఉంటే మ‌రింత బ‌లోపేతం అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.ఇలాంటి ప‌నులు చేయ‌నంత కాలం ప‌వ‌న్ మీద పెట్టుకున్న ఆశ‌లు నిజం కావ‌ని చెబుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube