జనసేనుడికి ఇలాంటి అభ్యర్ధులు కావాలట.     2017-10-26   04:21:03  IST  Bhanu C

జనసేన నాయకుడు ఎవ్వరు ఉహించని రీతిలో వేగంగా దూసుకుని వెళ్తున్నాడు. ఎంతమంది తనని మాటలతో దాడి చేస్తున్నా అవేమి పట్టించుకోకుండా..తన టీంతో దూసుకుని పోతున్నాడు.మొన్నటికి మొన్న హైదరాబాద్ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన పవన్ అతి త్వరలోనే విజయవాడ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు.అంతేకాదు తానూ పోటీ చేయబోయే ప్రతీ చోట ఎన్నుకునే అభ్యర్ధులు కోసం చాలా దిఫ్ఫ్రెంట్ స్ట్రాటజీ తో వెళ్తున్నాడని తెలుస్తోంది.

పవన్ ఇప్పుడు తనకి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులూ కావాలని కోరుకుంటున్నాడట. రాజకీయాల్లో ఉంటూ ఏపార్టీలో ఉన్నప్పటికీ ప్రజాసేవలో ముందు ఉండే నాయకులని తన పార్టీలోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఈ మేరకు ఇప్పటికే కొందరు టచ్ లో ఉన్న నేతలతో పాటు, తనకు తెలిసిన నేతలను కూడా జనసేనలోకి ఆహ్వానించాలని పవన్ అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ నుంచి జనసేనాని పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వద్దామనుకున్నా సినిమా షూటింగ్ లతో అదిసాధ్యం కాలేదు. దీంతో పవన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెల నుంచి బస్సు యాత్ర చేపట్టడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈ యాత్రకు ముందే పార్టీకి కొంత హైప్ తీసుకురావాలంటే క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలకు కండువా కప్పేందుకు సిద్ధమయ్యారట జనసేనాని.