పవన్ కళ్యాణ్ పేరు చెప్పి వృద్ధురాలి ఇల్లు కబ్జా చేసిన కేటుగాడు  

Janasena Vijayawada Pawan Kalyan Shyam Son - Telugu Ap Politics, House Occupied, Janasena Activists Fraud In Vijayawada, Pawan Kalyan

ప్రతి పార్టీలో వేల సంఖ్యలో కార్తకర్తలు ఉంటారు.వాళ్ళలో క్రియాశీలకంగా పార్టీ కోసం పని చేసేవారు ఉంటారు.

 Janasena Vijayawada Pawan Kalyan Shyam Son

అలాగే పార్టీ పేరు చెప్పుకొని మోసాలకి పాల్పడే వారు ఉంటారు.అలాంటి వారిని వెంటనే గుర్తించడం కష్టం అవుతుంది.

అయితే అలా ఉన్న కొంత మంది చేసే తప్పుడు పనుల కారణంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది.అయితే మీడియా మాత్రం ఇలాంటి ఇష్యూలలో పార్టీ నాయకత్వాన్ని దోషిగా ప్రాజెక్ట్ చేసి ప్రజలలోకి తప్పుడు అభిప్రాయాలనికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది.

పవన్ కళ్యాణ్ పేరు చెప్పి వృద్ధురాలి ఇల్లు కబ్జా చేసిన కేటుగాడు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి విజయవాడలో చోటు చేసుకుంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఆ పార్టీ కార్యకర్త తనని మోసం చేసి ఇళ్ళు రాయించుకున్నాడని విజయవాడ పాయకాపురం సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పింఛన్ పేరు చెప్పి తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె ఆరోపణలు చేసింది.కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడం, కుమారుడు హైదరాబాద్ లో ఉద్యోగరిత్యా ఉండటంతో తాను విజయవాడలో ఉంటున్నానని ఆమె పేర్కొంది.

జనసేన పార్టీ కార్యకర్త శ్యాంసన్ పవన్‌ కళ్యాణ్ ఒంటరి వృద్ధులకు నెలకు పదివేల చొప్పున పింఛన్‌ ఇస్తున్నాడని తనను నమ్మించి మోసం చేశాడని, తనకు పింఛన్ వచ్చిందని సంతకాలు చేయించుకున్నాడని, ఆరు నెలల తర్వాత ఇల్లు తనదేనంటూ అమ్మకానికి పెట్టాడని వృద్ధురాలు చెప్పింది.దీనిపై అడిగితే బెదిరింపులకి పాల్పడుతున్నాడు అంటూ సదరు వృద్ధురాలు పోలీసులు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Janasena Vijayawada Pawan Kalyan Shyam Son Related Telugu News,Photos/Pics,Images..

footer-test