పవన్ విశాఖ రాజకీయానికి బీజేపీ గండి ?

పంచాయతీ ఎన్నికల్లో వచ్చినా ఫలితాలతో జోష్ మీద ఉన్న జనసేన పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలలోనూ తమ సత్తా చాటిచెప్పాలి అని, రాజకీయంగా జనసేన పార్టీకి తిరుగులేదు అని నిరూపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి పట్టుదలతో ఉన్నారు.ఈ మేరకు ఎక్కడికక్కడ పార్టీ నాయకులను ఉత్సాహపరుస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, వీలైనన్ని ఎక్కువ స్థానాలు సంపాదించే దిశగా జనసైనికులను రంగంలోకి దింపారు.

 Janasena Troubled On Bjp Politics About Steel Plant Issue-TeluguStop.com

అయితే మిగతా చోట్ల ఎలా ఉన్నా, జనసేన మొదటి నుంచి కీలకంగా భావిస్తూ వస్తున్న ఉత్తరాంధ్రలో జనసేన పట్టు నిరూపించుకోవాలని, ముఖ్యంగా గ్రేటర్ విశాఖ లో పట్టు తమకు ఉందని నిరూపించుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.అయితే గ్రేటర్ విశాఖ ఎన్నికల ప్రచారంలో తాను కూడా పాల్గొని, పార్టీ కేడర్ లోనూ, ప్రజల్లోనూ ఉత్సాహం నింపాలని పవన్ భావించారు.

అయితే పవన్ అడుగు పెట్టకుండా స్టీల్ ప్లాంట్ ఉద్యమం అడ్డుపడుతోంది.

 Janasena Troubled On Bjp Politics About Steel Plant Issue-పవన్ విశాఖ రాజకీయానికి బీజేపీ గండి -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటి వరకు సీల్ ప్లాంట్ విషయంలో పవన్ పెద్దగా రియాక్ట్ కాలేదు.

మొదట్లో పవన్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పారు.బీజేపీ పెద్దలను కలిశారు.

ఆ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.ఏపీలో అనేక విషయాలపై ఘాటుగానే స్పందిస్తూ హడావుడి చేస్తూ వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంపై గట్టిగా బీజేపీని నిలదీయలేక మౌనంగా ఉండి పోతున్నారు.

ఐదో తేదీన జరిగిన ఏపీ బంద్ లో అన్ని పార్టీలు పాల్గొన్న, జనసేన మాత్రం ఈ వ్యవహారానికి దూరంగానే ఉంది.దీంతో సదరు స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు, విశాఖ వాసులు జనసేనను నిలదీస్తున్నారు.

కానీ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక పవన్ సతమతం అవుతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఇప్పుడు పవన్ మౌనంగానే ఉన్నా, విశాఖలో అడుగు పెడితే మాత్రం ఆయన దీనిపై స్పందించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.కానీ ఇప్పటికి ఇప్పుడు ఏం చెప్పాలో ? ఏం చెబితే ప్రజలు రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో తెలియక జనసైనికులు, తీవ్రంగా వర్రీ అయిపోతున్నారు.తాము విశాఖలో యాక్టివ్ పాలిటిక్స్ చేయకుండా బిజెపి పరోక్షం గా తమను ఇబ్బంది పెట్టింది అనే అభిప్రాయంలో జనసేన ఉంది.

#VizagSteel #Amithsha #Pavan #Janasena #Somu Veeraju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు