బీజేపీలోకి జ‌న‌సేన విలీనం.. పుకార్లా..? నిజ‌మా..?

ప్ర‌శ్నిస్తానంటూ రాజ‌కీయ పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.పొలిటిక‌ల్ ఫీట్లు ఆస‌క్తిగా మారాయి.

 Janasena To Join With Bjp-TeluguStop.com

ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు, వేస్తున్న అడుగులు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విష‌యంలోనూ ప్ర‌శ్నించ‌లేక‌పోవ‌డం, గ‌ట్టిగా నిల‌దీయ‌లేక‌పోవ‌డం ఆయ‌న‌కు మైన‌స్‌గా మారాయి.

ముఖ్యంగా ఏపీకి కేంద్రం ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చి విమ‌ర్శించిన ప‌వ‌న్‌.ఆ త‌ర్వాత ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం చేసింది ఏమీ క‌నిపించ‌డం ల‌దేనే విమ‌ర్శ‌లు వున్నాయి.

ఇక‌, 2014 నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబును వెనుకేసుకు వ‌చ్చిన ప‌వ‌న్‌.ఇప్పుడు మాత్రం తీవ్రంగా విభేదిస్తున్నాడు.

అదేస‌మ‌యంలో అనుభ‌వం లేకుండానే సీఎం సీటు కోసం ఆరాట ప‌డుతున్నాడంటూ.వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను విమ‌ర్శించిన ప‌వ‌న్‌.తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌న్నెత్తు మాట కూడా అన‌లేదు.ఇక‌, ప్ర‌త్యేక హోదాపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ త‌ప్ప.వైసీపీ స‌హా అన్ని ప‌క్షాలు పోటా పోటీగా పోరుకు సిద్ధ‌మైనా.జ‌న‌సేన నుంచి ఒక్క నేత కూడా ముందుకు రాలేదు.

పైగా.జ‌న‌సేన నాయ‌కులు ప్ర‌త్యేక హోదాపై ఎలాంటి కామెంట్లు సైతం చేయ‌డం లేదు.

దీంతో అస‌లు రాష్ట్రంలో ఇంత జ‌రుగుతు న్నా.జ‌న‌సేన ఏం చేస్తున్న‌ద‌నే ప్ర‌శ్న‌, అనుమానం క‌లుగుతోంది. ఇక‌, తాజాగా రేపో మాపో ప‌వ‌న్‌.జ‌నాల్లోకి వెళ్తున్నాడు.బ‌స్సు యాత్ర పేరుతో ఆయ‌న జ‌నాల‌ను క‌ల‌వడం ద్వారా.జ‌నాల క‌ష్ట సుఖాల‌ను తెలుసుకుంటాన‌ని చెబుతున్నాడు.

అయితే, ఇంత‌లోనే జ‌న‌సేనాని యూట‌ర్న్ తీసుకున్నాడ‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.ఇటీవ‌ల కాలంలో టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్న‌ట్టుగా జ‌న‌సేనాని.

బీజేపీతో మిలాఖ‌త్ అయ్యాడ‌ని అంటున్నారు.అయితే, ప‌వ‌న్ అంటే గిట్ట‌క‌నే ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అంద‌రూ అనుకున్నారు.
అయితే, ఇప్పుడు తాజాగా.ప‌వ‌న్ బీజేపీతో సంబంధాలు పెంచుకోవ‌డ‌మే కాకుండా రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌ల‌సి పోరుకు సిద్ధ‌మ‌వు తు న్నాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి.ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ సూచ‌న‌ల మేర‌కు కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఏపీ బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించార‌ని తాజాగా బీజేపీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ ప‌రిణామాల‌ను ద‌గ్గ‌రగా గ‌మ‌నిస్తే.

ఇటీవ‌ల కాలంలో బీజేపీని విమ‌ర్శించ‌కుండా… ప్ర‌త్యేక హోదా విష‌యంలో మాటైనా మాట్లాడ‌కుండా వ్య‌వ‌హ‌రించ‌డం, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌హా బీజేపీ నేత‌ల‌ను ఒక్క‌మాటైనా అన‌క‌పోవ‌డం, ఇప్పుడు క‌న్నా విష‌యంలో సిఫార్సులు చేశాడ‌నే వార్త‌ల‌ను బ‌ట్టి .బీజేపీకి ప‌వ‌న్ చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నాడ‌ని అంటున్నారు.అయితే, ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్ బీజేపీతోనే మిలాఖ‌త్ అయ్యేలా వ్య‌వ‌హ‌రించేందుకు రెడీ అవుతున్నాడ‌ని అంటున్నారు.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube