జగన్ ను ఎదుర్కునేందుకు ఉమ్మడి వ్యూహం  ?  జనసేనే కీలకం ?

Janasena Tdp Strategy To Counter Ycp Government

ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనేందుకు బీజేపీ, టిడిపి, జనసేన వంటి పార్టీలు విడివిడిగా పోరాటం చేస్తున్నాయి.జగన్ కు పరిపాలన చేత కావడం లేదని, వైసీపీ ప్రభుత్వం కారణంగా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,  అరాచక పాలన కొనసాగుతోందని ఎన్నో విమర్శలు చేస్తున్నాయి .

 Janasena Tdp Strategy To Counter Ycp Government-TeluguStop.com

అయితే మూడు పార్టీలు విడివిడిగా వైసీపీ ప్రభుత్వం పై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న,  ఆశించిన ఫలితం కనిపించడం లేదు.బిజెపి , జనసేన పొత్తు పెట్టుకున్నా,  ఆందోళన కార్యక్రమాలు విషయానికి వచ్చినప్పటికీ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

బిజెపి సైతం మొన్నటి వరకు టిడిపి విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చింది.టిడిపి అధినేత చంద్రబాబు బిజెపితో పొత్తు కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా,  టిడిపిని దగ్గర చేసుకునేందుకు బిజెపి ఏమాత్రం ఇష్టపడలేదు.

 Janasena Tdp Strategy To Counter Ycp Government-జగన్ ను ఎదుర్కునేందుకు ఉమ్మడి వ్యూహం    జనసేనే కీలకం -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పైగా తెలుగుదేశం పార్టీతో ఎప్పటికీ పొత్తు ఉండదు అంటూ కొంతమంది బిజెపి అగ్ర నేతలు ప్రకటనలు చేశారు.ఇక ఇప్పుడు చూస్తే ఏపీలో అమరావతి వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

అమరావతి ని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు,  మహిళలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.ఈ యాత్ర ఇలా సాగుతుండగానే బిజెపి నేతలు యాత్రకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా,  పాదయాత్రలో పాల్గొన్నారు.

ఇదే సమయంలో మూడు రాజధానుల బిల్లు ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేసింది.

ఇక్కడితో ఈ కథ ముగిసింది అనుకున్నా,  జగన్ మాత్రం మరో కొత్త బిల్లును తీసుకువస్తామని ప్రకటించడంతో అమరావతి వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ఇంక సానుకూల ధోరణితో లేదు అనే విషయం అందరికీ అర్థమైపోయింది.

Telugu Amaravathi, Ap Capital, Ap Government, Cbn, Chandrababu, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan, Tdp, Ysrcp-Telugu Political News

దీంతో ఈ మహాపాదయాత్ర ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు .అయితే ఈ యాత్రలో టిడిపి కి చెందిన వారు పాల్గొనడం,  అదే సమయంలో బిజెపి తరఫున అనేకమంది పాల్గొనడం తో,  బిజెపి , టిడిపి నేతలకు మాటలు బాగానే కలుస్తున్నాయి.దీంతో జగన్ ను ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా పోరాడదామని,  టిడిపి,  బిజెపి మాత్రం ఈ విషయంలో సానుకూలంగా లేదు.

బిజెపి ,టిడిపి , జనసేన మూడు పార్టీలు ఉమ్మడిగా పోరాటం చేసి ఎన్నికలకు వెళితే తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేయవచ్చని జనసేన, తెలుగుదేశం పార్టీలు ప్రతిపాదిస్తున్నా,  బీజెపీ మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉంది.దీంతో ఇప్పుడు బిజెపి ని ఒప్పించే బాధ్యతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

  రాబోయే ఎన్నికల నాటికి ఏదో రకంగా బిజెపి ఒప్పించి ఆ పార్టీకి గతంతో పోలిస్తే మరింత ఎక్కువ సీట్లు కేటాయించాలని చేసి, మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లాలని  చంద్రబాబుతో పాటు పవన్ కూడా అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం.

#AP #Chandrababu #Janasenani #Amaravathi #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube