జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న ?

ఏపీలో 2024 ఎన్నిక‌లకు స‌మ‌యం చాలా త‌క్కువ‌గా ఉంది.ఇప్ప‌టికే రాజ‌కీయాలు షురూ అయ్యాయి.

 Janasena Tdp Alliance Is A Million Dollar Question Details, Ap Political Latest-TeluguStop.com

ఇక జులై 8న వైసీపీ ప్లీన‌రీ ముగియ‌గానే ఎన్నిక‌ల రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారడం ఖాయం.ఒక్క‌సారిగా ఏపీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారిపోతాయి.

అయితే నిన్న‌టి జ‌న‌సేనాని ప‌వ‌న్ ఏర్ప‌టు చేసిన సభ చ‌ర్చ‌కు దారితీస్తోంది.ప‌వ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌తో జ‌న‌సైనికులు తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

ఇక స‌భ‌లో వైసీపీ, టీడీపీ, బీజేపీల‌తో పొత్తుల విష‌య‌మై స్ప‌ష్ట‌త‌నిచ్చారు.కానీ, పొత్తుల పంప‌కంలో తేడాలొస్తే ఏంట‌నేది ? మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారుతోంది.

వైసీపీ వ్య‌తిరేక ఓట్లు చీల్చమంటూనే వైసీపీ ప‌ట్ల త‌మ వైఖ‌రిని తేల్చి చెప్పారు.ఇక రోడ్ మ్యాప్‌తో బీజేపీ స్నేహం గురించి చెప్ప‌క‌నే చెప్పేశారు.మ‌రోవైపుటీడీపీతోను పొత్తు ఉండొచ్చ‌ని వివ‌రించారు.ఇవి ప‌వ‌న్ అంత‌రార్థ స‌హిత భావాలు అని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పేర్కొంటున్నారు.

మొత్తంగా గ‌తంలో చెప్పిన విధంగా, చేసిన విధంగగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఇక త‌ప్పులు చేయ‌ర‌ని జ‌న‌సైనికులు ఆశిస్తున్నార‌ట‌.ఒక‌వేళ టీడీపీతో పొత్తు ఉంటే ఏయే స్థానాల‌ను ప‌వ‌న్ అడుగుతారు అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే.

ఒక‌వేళ బీజేపీతో మైత్రి కుదిరితే అప్పుడు సీట్ల పంప‌కం ఏంట‌నేది కూడా మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌నే.

ఒక‌వేల పొత్తులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజ‌క‌వ‌ర్గంను ప‌వ‌న్ కోరితే టీడీపీ వ‌దులుకుంటుందా ? అస‌లు పొత్తే వ‌ద్దంటుందా ? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.దీనిక కార‌ణం లేక‌పోలేదు.గ‌తంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి.

దీంతో జ‌న‌సేన పార్టీ నేత‌లు టీడీపీని విశ్వ‌సించ‌డం లేద‌ని స‌మాచారం.అయితే పొత్తులు కుదిరితే మాత్రం జ‌న‌సేన అధినేత‌ను టీడీపీ, బీజేపీ లు భుజాన ఎత్తుకుని ముందుకు న‌డ‌వాల్సిందేన‌ని జ‌న‌సేన త‌మ్ముల్లు పేర్కొంటున్నారు.

అయితే టీడీపీలోనూ పొత్తుల సంద‌ర్భంగా ఏం కోల్పోవాల్సి వ‌స్తుందోన‌ని టెన్స‌న్ లో ఉన్నార‌ట‌.ఇప్ప‌టికే టీడీపీ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జిల‌ను నియ‌మిస్తున్నారు.

తాజాగా శ్రీకాకుళం జిల్లా న‌ర‌స‌న్న పేట నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే బ‌గ్గు ర‌మ‌ణమూర్తిని నియ‌మించారు.అంటే అత‌ను స్థానిక అసెంబ్లీ నుంచి పోటీ చేసే అభ్య‌ర్థి అని అర్థమ‌వుతోంది.ఇక్క‌డి నుంచే బీజేపీ పోటీ చేయాల‌నుకుంటే టీడీపీ ప‌రిస్థితేంటీ ? అనేదే హాట్ టాపిక్‌గా మారింది.ఒక‌వేళ జ‌న‌సేన‌ను నెగ్గ‌కుండా టీడీపీ ల‌బ్ధిపొందాల‌ని భావిస్తే మాత్రం పొత్తులు వ‌ద్దే వ‌ద్ద‌ని జ‌న‌సైనికులు భావిస్తున్నార‌ట‌.

మ‌రి పొత్తుల నేప‌థ్యంలో త‌లెత్తిన ఈ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌కు స‌మాధానం రావాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Janasena TDP Alliance Is A Million Dollar Question Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube