అమరావతి ఆందోళనలు ఆపేయబోతున్న జనసేన  

Janasena Silent In Amaravathi Issue-janasena,janasena Pawan Kalyan

గత మూడు వారాలుగా అమరావతి రైతులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విషయం తెల్సిందే.ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి కూడా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తూ రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న విషయం తెల్సిందే.

Janasena Silent In Amaravathi Issue-Janasena Pawan Kalyan

తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు కూడా అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా పోరాటాలు చేస్తున్నారు.అయితే అమరావతి రాజధాని ఉద్యమాన్ని అర్థాంతరంగా ఆపేయాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించినట్లుగా సమాచారం అందుతోంది.


ఇటీవల జనసేన పార్టీ సర్వసభ్యసమావేశం నిర్వహించారు.ఆ సమయంలో ప్రస్తుతానికి రాజధాని విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోని కారణంగా ముందస్తుగానే ఆందోళనలు అనవసరం అనుకుంటున్నారు.

రాజధాని విషయంలో ఒక నిర్ణయంను ప్రభుత్వం తీసుకున్న తర్వాత అప్పుడు కార్యచరణ ఏర్పాటు చేసి ఆందోళన చేయాలని నిర్ణయించారు.ప్రస్తుతానికి పూర్తి యాక్టివ్‌గా ఆందోళనలు అయితే జనసేన తరపున చేయబోవద్దని నిర్ణయం తీసుకున్నారు.

తాజా వార్తలు