జనసేన రెండో జాబితా..పాలకొల్లు పై వీడని సస్పెన్స్..!

జనసేనాని తన పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్ధుల జాబితాని విడతల వారీగా విడుదల చేస్తున్నాడు.ఈ క్రమంలో రెండో జాబితాని అర్ధరాత్రి సమయంలో విడదల చేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ మొదట జాబితా మాదిరిగానే 32 మంది అసెంబ్లీ అభ్యర్ధుల పేర్లని ప్రకటించారు.

 Janasena Released Second List Of Janasena Candidates For Mla And Mp-TeluguStop.com

మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి గాను పొత్తుల్లో భాగంగా 140 స్థానాలలోనే పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ కేవలం 64 స్థానాలకి మాత్రమే అభ్యర్ధులని ప్రకటించారు.

వామపక్షాల పొత్తుల్లో భాగంగా 14 అసెంబ్లీ , 4 పార్లమెంట్ స్థానాలని ఇచ్చిన పవన్ కళ్యాణ్ , బీఎస్పీ కి 21 అసెంబ్లీ 3 లోక్ సభ స్థానాలని ప్రకటించారు.మొత్తం 25 పార్లమెంటు స్థానాలకి గాను పొత్తుల్లో భాగంగా 7 స్థానాలని ఇతర పార్టీలకి కేటాయించిన పవన్ కళ్యాణ్ ఇప్పటికి జనసేన తరుపున మిగిలిన 18 పార్లమెంటు స్థానాలకి గాను పవన్ ఇప్పటికి 8 స్థానాలని ప్రకటించారు ఇంకా 10 స్థానాలని చివరి జాబితాలో ప్రకటిస్తారని తెలుస్తోంది.

అయితే తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కో జిల్లానుంచీ కొంతమంది చప్పున 32 మంది అభ్యర్ధులని ప్రకటించారు.

ఇంకా 76 స్థానాలకి గాను అభ్యర్ధులని ప్రకటించాల్సి ఉంది.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ యువతకి, కొత్తవారికి పెద్ద ఎత్తున అవకాశాలు కలిపించినట్టుగా తెలుస్తోంది.ఇదిలాఉంటే

పవన్ కళ్యాణ్ ఎంతో కీలక స్థానాలపై ఇప్పటి వరకూ ప్రకటన చేయకపోవడంతో ఎంతో ఉత్ఖంట నెలకొంది.అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచీ పోటీ చేస్తారో అనే ఆత్రుత నెలకొంది.అయితే ముఖ్యంగా తన అన్ని కోల్పోయిన పాలకొల్లు పై ప్రకటన ఇప్పటి వరకూ లేకపోవడం పార్టీ వర్గాలలో తీవ్ర చర్చలకి దారితీస్తోంది.ఇదిలాఉంటే తాజాగా ప్రకటించిన అభ్యర్ధుల వివరాలలోకి వెళ్తే.

పార్లమెంట్ అభ్యర్ధులు (ఆంధ్రప్రదేశ్‌)


1.అర‌కు- శ్రీ పంగి రాజారావు

2.మ‌చిలీప‌ట్నం- శ్రీ బండ్రెడ్డి రాము

3.రాజంపేట‌- శ్రీ స‌య్య‌ద్ ముక‌రం చాంద్‌

4.శ్రీకాకుళం- శ్రీ మెట్ట రామారావు (ఐ.ఆర్‌.ఎస్‌)

పార్లమెంట్ అభ్యర్ధి (తెలంగాణ‌)


1.సికింద్రాబాద్‌- శ్రీ నేమూరి శంక‌ర్‌గౌడ్‌

అసెంబ్లీ అభ్యర్ధులు (ఆంధ్రప్రదేశ్‌)

1.ఇచ్చాపురం-శ్రీ దాస‌రి రాజు

2.పాత‌ప‌ట్నం- శ్రీ గేదెల చైత‌న్య‌

3.అముదాల‌వ‌ల‌స‌- శ్రీ రామ్మోహ‌న్‌

4.మాడుగుల‌- శ్రీ జి.స‌న్యాసినాయుడు

5.పెందుర్తి- శ్రీ చింత‌ల‌పూడి వెంక‌ట‌రామ‌య్య‌

6.చోడ‌వ‌రం- శ్రీ పి.వి.ఎస్‌.ఎన్ రాజు

7.

అన‌కాప‌ల్లి- శ్రీ ప‌రుచూరి భాస్క‌ర‌రావు

8.కాకినాడ రూర‌ల్‌- శ్రీ పంతం నానాజీ

9.రాజాన‌గ‌రం- శ్రీ రాయ‌పురెడ్డి ప్ర‌సాద్‌(చిన్నా)

10.రాజ‌మండ్రి అర్బ‌న్‌- శ్రీ అత్తి స‌త్య‌నారాయ‌ణ‌

11.దెందులూరు- శ్రీ గంట‌సాల వెంక‌ట‌ల‌క్ష్మి

12.న‌ర‌సాపురం- శ్రీ బొమ్మ‌డి నాయ‌క‌ర్‌

13.నిడ‌ద‌వోలు- శ్రీ అటిక‌ల ర‌మ్య‌శ్రీ

14.త‌ణుకు- శ్రీ ప‌సుపులేటి రామారావు

15.అచంట- శ్రీ జ‌వ్వాది వెంక‌ట విజ‌య‌రామ్‌

16.చింత‌ల‌పూడి- శ్రీ మేక‌ల ఈశ్వ‌ర‌య్య‌

17.అవ‌నిగ‌డ్డ‌- శ్రీ ముత్తంశెట్టి కృష్ణారావు

18.పెడ‌న- శ్రీ అంకెం ల‌క్ష్మీ శ్రీనివాస్‌

19.కైక‌లూరు- శ్రీ బి.వి రావు

20.విజ‌య‌వాడ వెస్ట్‌- శ్రీ పోతిన వెంక‌ట మ‌హేష్‌

21.విజ‌య‌వాడ ఈస్ట్‌- శ్రీ బ‌త్తిన రాము

22.గిద్ద‌లూరు శ్రీ షేక్ రియాజ్‌

23.కోవూరు (నెల్లూరు జిల్లా) – శ్రీ టి.రాఘ‌వ‌య్య‌

24.అనంత‌పురం అర్బ‌న్‌- డాక్ట‌ర్‌ శ్రీ కె.రాజ‌గోపాల్‌

25.క‌డ‌ప‌- శ్రీ సుంక‌ర శ్రీనివాస్‌

26.రాయ‌చోటి- శ్రీ ఎస్‌.కె హ‌స‌న్ భాషా

27.

ద‌ర్శి- శ్రీ బొటుకు ర‌మేష్‌

28.ఎమ్మిగ‌నూరు- శ్రీమ‌తి రేఖ గౌడ్‌

29.పాణ్యం- శ్రీ చింతా సురేష్‌

30.నందికొట్కూరు- శ్రీ అన్న‌పురెడ్డి బాల వెంక‌ట్‌

31.తంబ‌ళ్ల‌ప‌ల్లి- శ్రీ విశ్వం ప్ర‌భాక‌ర్‌రెడ్డి

32.ప‌ల‌మ‌నేరు- శ్రీ చిల్ల‌గ‌ట్టు శ్రీకాంత్ కుమార్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube