రెండు తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే స్క్రీన్ మీద ఎంతో హుందాగా కనిపించే పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో మాత్రం చాలా సాదా సీదా జీవితం గడుపుతుంటాడు.
ఇందులో భాగంగా తన తోటలో వ్యవసాయం కూడా చేస్తాడు.అలాగే మామిడి పండ్లను పండించి సినీ పరిశ్రమలో తనకు ఇష్టమైన వాళ్ల ఇంటికి కూడా పంపిస్తున్నట్లు గతంలో కొందరు నటీనటులు తెలిపారు.
అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.అయితే ఆ ఫోటో ఒకసారి పరిశీలించినట్లయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ కింద కూర్చొని గమనిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో కొంత మంది మెగా అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే వైరల్ చేస్తున్నారు.అంతేగాక పవన్ కళ్యాణ్ నిరాడంబరుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎంసిఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్ర దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న “వకీల్ సాబ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అయితే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి సినిమాలకు దాదాపు మూడేళ్ళ పాటు దూరంగా ఉన్నాడు.
అయితే ఇటీవలే మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి పవన్ కళ్యాణ్ తన అభిమానుల అంచనాలను అందుకుంటాడా లేదో చూడాలి.