తెలంగాణ గెడ్డ మీద జనసేన జెండా ఎగరబోతుందా! పవన్ కళ్యాణ్ ప్రణాళిక  

తెలంగాణ స్థానిక సంస్థలపై ఎన్నికలపై ద్రుష్టి పెట్టిన పవన్ కళ్యాణ్. .

Janasena Planing To Contest In Telangana Local Elections-janasena Planing To Contest In Telangana,local Elections,pawan Kalyan,tdp,trs

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి రంగం సిద్ధం అయ్యింది. ప్రధాన పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవడం ద్వారా బలం నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాయి. మరో వైపు అధికార పార్టీ టీఆర్ఎస్ స్థానిక సంస్థలు అన్ని గెలిచి క్లీన్ స్వీప్ చేయడం ద్వారా ఏకచత్రాధిపత్యం సాధించాలని అనుకుంటుంది..

తెలంగాణ గెడ్డ మీద జనసేన జెండా ఎగరబోతుందా! పవన్ కళ్యాణ్ ప్రణాళిక-Janasena Planing To Contest In Telangana Local Elections

ఇదిలా ఉంటే సామాజిక మార్పే లక్ష్యంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఫోకస్ పెట్టింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పవన్ కల్యాణ్కు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చర్చించి ఎన్నికలలో ఎలాంటి కార్యాచరణతో ముందుకి వెళ్ళాలి.

ఎంత వరకు ప్రభావం చూపించొచ్చు అనే విషయాల మీద చర్చించారు. గెలిచే స్థాయిలో సీట్లు రాకున్న యువతలో ఎక్కువగా జనసేన మీద అభిమానం ఉన్న కారణంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా జనసేనతో భవిష్యత్తు ఉంటుందని జనంలోకి తీసుకెళ్ళే అవకాశం ఉంటుందని భావించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్ధం కావాలని సూచించినట్లు తెలుస్తుంది. ఐతే కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయం తీసుకోవాలని పవన్ సూచిచండంతో ఆ పార్టీ నేతలు శనివారం సమావేశమయ్యారు.