టిడిపి నీడ నుంచి బయటపడడానికి పవన్ కళ్యాణ్ ప్రణాళిక  

టీడీపీ నీడ నుంచి బయటకి వస్తున్న పవన్ కళ్యాణ్. .

Janasena Plan To Quit Out Of Box From Tdp Shadow-janasena Plan To Quit Out Of Box,tdp Shadow,ysrcp

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ ప్రణాళికలతో భవిష్యత్ కార్యాచరణ సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి బాధ నుంచి బయటపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఓటమికి కారణాలను ఇప్పటికే విశ్లేషించినట్లు సమాచారం. జిల్లాల వారీగా కొద్దిరోజుల క్రితం చేసిన సమీక్షలో లో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి కూడా జనసేన పార్టీ అధినేత ఫీడ్ బ్యాక్ తీసుకున్నారని తెలుస్తోంది..

టిడిపి నీడ నుంచి బయటపడడానికి పవన్ కళ్యాణ్ ప్రణాళిక-Janasena Plan To Quit Out Of Box From TDP Shadow

ఇందులో చాలామంది జనసేన పార్టీ ఓటమికి ప్రధాన కారణం వైయస్సార్సీపి చేసిన ఆరోపణలను తిప్పికొట్టే లేకపోవడం కారణం అని తెలుస్తుంది. జనసేన పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన మరల పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి సహకరిస్తారని ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని దీనిని తిప్పికొట్టే ప్రయత్నంలో జనసేన పార్టీ విఫలమైనట్లు నేతలు చెప్పినట్లు సమాచారం. అలాగే ప్రజారాజ్యం పార్టీ నీడలో ఉన్న జనసేన పార్టీని ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో విశ్వసించక పోయారని జనసేన అధినేత కూడా గ్రహించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో జనసేన పార్టీ సంస్థాగతంగా తన బలం పెంచుకోవడంతో పాటు టిడిపి నీడ నుంచి బయటకు రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి పార్టీ నేతలతో కార్యకర్తలతో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టడం ద్వారా జనసేన బలాన్ని గళాన్ని గట్టిగా వినిపించాలని ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.