16న జనసేన-బీజేపీ కీలక సమావేశం... పొత్తుపైన చర్చలు  

Janasena Chief Pawan Kalyan Respond On Kakinada Issue - Telugu Ap Politics, Janasena Chief, Kakinada Issue, Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డాని కలిసి ఏపీ తిరిగి వచ్చారు.ఇక విశాఖలో దిగి నేరుగా కాకినాడ వెళ్లి అకక్డ మొన్న వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ జన సైనికులు, నాయకులని పరామర్శించారు.

Janasena Chief Pawan Kalyan Respond On Kakinada Issue - Telugu Ap Politics, Janasena Chief, Kakinada Issue, Pawan Kalyan-Telugu Political News-Telugu Tollywood Photo Image

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాకినాడ ఘటన గురించి మాట్లాడారు.ఈ ఘటనలో జనసేన నేతలపై దాడి చేసిన వైసీపీ గుండాలని అరెస్ట్ చేయాలని, అలాగే ఈ స్థాయిలో తమపై దాడి చేసిన కనీసం సంబంధం లేనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ఇలాంటి ఘటనలు మరలా పునరావృత్తం అయితే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు.

ఇదే సమయంలో జనసేన అధినేత మరో కీలక విషయాన్ని కూడా చెప్పారు.

ఈ నెల 16న విజయవాడలో కీలక సమావేశం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో బీజేపీ నేతలతో చర్చించడంతో పాటు, పొత్తు విషయంపై ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇక ఉమ్మడి కార్యాచరణతో ముందుకి వెళ్ళే విషయం మీద కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సమావేశం బీజేపీతో అనే విషయాన్ని మాత్రం జనసేనాని బయట పెట్టలేదు.

ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యే రాపాక గురించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానం దాటవేశారు.మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద వైసీపీ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

తాజా వార్తలు