సీరియ‌స్ పాలిటిక్స్‌లో ఈ కామెడీ లేంటి ప‌వ‌న్‌   Pawan Tweets On AP Special Status Turns Comedy     2016-12-20   04:11:29  IST  Bhanu C

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కామెంట్లు కామెడీ పుట్టిస్తున్నాయి! పాలిటిక్స్‌లో ప్ర‌జారాజ్యం త‌ర్వాత ఓన్‌గా రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్‌పై తెలుగు ప్ర‌జ‌లు ముఖ్యంగా ఏపీ వాళ్లు పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకున్నారు. ఏపీ లో ఏకైక విప‌క్షంగా ఉన్న వైకాపా అధినేత జ‌గ‌న్ వైఖ‌రిపై వెల్లువెత్తిన వ్య‌తిరేక వార్త‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌కు ప్ర‌త్యామ్నాయంగా త‌మ క‌ష్టాలు వినే ఓ నేత కోసం ప్ర‌జ‌లు ఎదురు చూశారు. అదేస‌మ‌య‌లో జ‌న‌సేన పేరుతో ప‌వ‌న్ ఎంట్రీ ఇవ్వ‌డాన్ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లూ స్వాగ‌తించారు. ఈ క్ర‌మంలోనే త‌మ క‌ష్టాలు చెప్పుకునేందుకు అమ‌రావ‌తి ప్రాంత రైతుల మొద‌లు.. ప‌శ్చిమ‌గోదావ‌రిలోని భీమ‌వ‌రం ప్రాంత ఆక్వా పార్క్ బాధిత రైతులు కూడా హైద‌రాబాద్‌కు క్యూ క‌ట్టారు.

ఇక‌, రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక స‌మ‌స్య‌ల‌పైనా ప‌వ‌న్ పోరాటం చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా, కేంద్రం నుంచి నిధుల విష‌యంలో ప‌వ‌న్ విజృంభిస్తాడ‌ని భావించారు. నిజానికి 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇటు చంద్ర‌బాబు, అటు న‌రేంద్ర మోడీలు ఏపీ ప్ర‌జ‌ల‌కు హోదాపై హామీ ఇచ్చారు. అయితే, రాజ‌కీయ ప్రాధాన్యాల నేప‌థ్యంలో ఈ హోదాను గ‌ట్టెక్కించారు. అయితే, ఈ విష‌యంలో కేంద్రంతో పోరాడైనా హోదా సాధించే నేత లేక పోవ‌డం ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. ఈ నేప‌థ్యంలో హోదాపై ప‌వ‌న్ గ‌ళం విప్ప‌డాన్ని అంద‌రూ స్వాగ‌తించారు.

అయితే, బాధ్య‌త పెరిగిన కొద్దీ… త‌నపై అంచ‌నాలు పెరిగిన కొద్దీ.. ఎంతో బాధ్య‌త‌గా ఉండాల్సిన ప‌వ‌న్.. రానురాను మ‌రింత జోక్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌నే టాక్ వ‌స్తోంది. ప్ర‌త్యేక హోదాను పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చ‌డాన్ని ఏపీ ప్ర‌జ‌లు స్వాగ‌తించారు. కానీ, ఆ త‌ర్వాత ఆయ‌న తీసుకున్న డెసిష‌న్లు, ఎలాంటి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం, హోదా విష‌యంలో అటు కేంద్రంలోని మోడీ ది ఎంత త‌ప్పు ఉందో.. ఇటు రాష్ట్రంలోని చంద్ర‌బాబుది కూడా అంతే త‌ప్పు ఉన్న విష‌యాన్ని దాచి పెట్టి.. కేవ‌లం కేంద్రంలోని మోడీ, వెంక‌య్య నాయుడ‌ల‌పై విరుచుకుప‌డ‌డంపై కొన్ని వ‌ర్గాల్లో ప‌వ‌న్‌ను చుల‌క‌న చేస్తోంది.

ఇక‌, తాజాగా.. ప‌వ‌న్ చేసిన ట్వీట్ మ‌రింత‌గా కామెడీ పుట్టిస్తోంద‌ని అంటున్నారు మెజారిటీ జ‌నాభా. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ సమయంలో అమరులైన వారిపైన ఆన‌… ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తా- అంటూ తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య అంద‌రికీ న‌వ్వుతెప్పిస్తోంద‌ట‌! ఎప్పుడో మురిగిపోయిన జై ఆంధ్ర ఉద్య‌మం గురించి ఇప్ప‌డెందుకు ప‌వ‌న్ అని వాళ్లు ఎదురు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా అస‌లు ఏం చేస్తావో చెప్ప‌కుండా ఈ ఆన‌లెందుకు? అని కూడా వాళ్లు ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి ఉండ‌గా.. ఈ ఆన‌ల‌తో వ‌ర్క‌వుట్ కాద‌ని, కార్యాచ‌ర‌ణ ముఖ్య‌మ‌ని కూడా వాళ్లు స‌ల‌హా ఇస్తున్నారు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తాడో చూడాలి. ఇప్ప‌టికైతే.. ఏపీ పాలిటిక్స్‌లో ప‌వ‌న్‌.. ఓ క‌మెడియ‌న్‌గా మారాడ‌నే టాక్ వినిపిస్తోంది!