పవన్ ఈ నిర్ణయం తీసుకుంటే జనసేన కు మంచి రోజులే ?

బలం బలగం ఏపీలో ఉన్నా, రాజకీయంగా ఎదగలేక పోతున్నామనే బాధ జనసేన అధినేత పవన్ కళ్యాణ లో చాలా కాలంగా ఉంది.

అసలు 2019 ఎన్నికల్లో అంత దారుణమైన ఓటమి చవి చూస్తాము అని పవన్ ఊహించలేదు.

చివరికి తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెంది ఘోర అవమానం చవిచూశారు.

ఈ అవమానాలు అన్నీ దిగమింగుకుని పార్టీని రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే విధంగా కసరత్తు చేస్తున్నారు.

మరోవైపు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సినిమాల వైపు దృష్టి పెట్టారు.ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారు.

కానీ జనసేన పై ఇంకా జనాల్లో అనుమానాలు ఉండడం, ఆ పార్టీ తెలుగుదేశం కనుసన్నల్లో పని చేస్తుందనే అభిప్రాయం కలగడం, టిడిపి ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని, అలాగే వైసిపి ఏ నిర్ణయం తీసుకున్నా దానిని వ్యతిరేకిస్తారనే ముద్ర జనాల్లో బాగా వచ్చేసింది.

రాజకీయంగా పవన్ కు ఇది మచ్చ గా మిగిలిపోతూ వస్తోంది.ప్రస్తుతం బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నా, పెద్దగా ఉపయోగం లేనట్టుగా ఉండడం, ఇంకా తాను టిడిపిమనిషిని అని జనాలు నమ్ముతూ ఉండటం వంటి పరిణామాల నేపథ్యంలో పవన్ టిడిపి కి దూరంగా ఉండడమే కాకుండా, టిడిపి కూడా తమకు రాజకీయ శత్రువే అనే సంకేతాలను పంపించే విధంగా పవన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అందుకే కొద్ది రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ 108 అంబులెన్సులు ప్రారంభించిన సందర్భంగా, ఆయనను ప్రశంసిస్తూ పవన్ ట్వీట్ చేయడం వెనక కూడా కారణాలు అవే అని తెలుస్తోంది.

ఇక బిజెపి తో పొత్తు పెట్టుకున్నా, తమను పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరిస్తుండడంతో ఇకపై అన్ని విషయాల్లోనూ క్లారిటీ గా ఉండడమే కాకుండా, టీడీపీకి జనసేనకు సంబంధం లేదని నిరూపిస్తూ బీజేపీతో పొత్తు విషయమై క్లారిటీ గా ఉండాలని, ఆ పార్టీతో కలిసి క్లారిటీ గా రాజకీయాలు చేయాలని, ఇకపై క్షేత్రస్థాయిలో బలం పెంచుకుని టిడిపినీ సమదూరం పెడుతూనే, ఆ పార్టీ పైన విమర్శలు చేసేందుకు వెనుకడుగు చేయకూడదనే క్లారిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

"""/"/ ఇప్పటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, బీజేపీ సహకారంతో 2024 ఎన్నికల్లో అధికార పీఠం దక్కించుకోవాలనే విధంగా పవన్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఖచ్చితంగా తమ పార్టీపై టిడిపి ముద్ర పూర్తిగా తొలగిపోవాలనే ఈ విషయాన్ని పవన్ గుర్తించినట్లుగా కనిపిస్తోంది.

పవన్ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకోవడంపై జనసైనికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.బిజెపితో పొత్తు విషయం లోనూ ఇదే రకమైన క్లారిటీ కి పవన్ రావాలని, హైదరాబాద్ లో ఉంటూ రాజకీయాలు చేయడం కంటే ఏపీ లో మకాం వేసి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాలని జనసైనికులు కోరుతున్నారు.

నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు..: మంత్రి కోమటిరెడ్డి