పవన్ కు కుల రాజకీయం కలిసి వస్తుందా ?  

Will Pawan get caste politics together, Janasena, Pawan Kalyan, YSRCP, Mudragadda Padhamanabham, Kapu Nestham, Telugudesham Party, Kapu Reservation, - Telugu Janasena, Kapu Nestham, Kapu Reservation, Mudragadda Padhamanabham, Pawan Kalyan, Telugudesham Party, Ysrcp

గంపగుత్త గా కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ తమ ఖాతాలో పడతాయని , ఆ కులం జనసేన ను ఆరాదిస్తోంది అని, ఎన్నికలకు ముందు ఆ పార్టీ అధినేత పవన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.కాపు ఓటు బ్యాంకు తో పాటు, మరి కొన్ని సామాజిక వర్గాలు ఓట్లతో కనీసం రెండు గోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీకి మంచి ఆదరణ లభించి కనీసం 20, 30 సీట్లు వస్తాయని 2019 ఎన్నికలకు ముందు అంచనా వేశారు.

 Janasena Pawan Kalyan Ysrcp

అదీకాకుండా ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత జగన్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేను అంటూ చెప్పేయడంతో, ఆ ప్రకటన జనసేనకు బాగా కలిసి వస్తుందని వైసిపికి కాపు సామాజికవర్గం నుంచి ఓట్లు పడవని, జనసేన అంచనా వేసింది.

కానీ అనూహ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లు చాలావరకు వైసీపీ ఖాతాలో పడడం, జనసేన ఆ సామాజిక వర్గం ఆదరణ దక్కించుకోలేక పోవడంతో పాటు, ప్రజల్లో పవన్ తీరు పై నమ్మకం లేకపోవడం వంటి కారణాలతో జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయిపోయింది.

పవన్ కు కుల రాజకీయం కలిసి వస్తుందా -Political-Telugu Tollywood Photo Image

దీనికి అనేక కారణాలు ఉన్నాయి.మొదటి నుంచి కాపు సమస్యలపై పవన్ క్లారిటీ గా లేకపోవడం, రిజర్వేషన్ల అంశంపై ముద్రగడ పద్మనాభం వంటి వారు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా, పవన్ పట్టించుకోకపోవడం వంటి కారణాలతో పవన్ పై ఆ సామాజిక వర్గం లోనే నమ్మకం ఏర్పడలేదు.

దీంతో ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అని నష్టటనివారణ చర్యలకు దిగారు.

సొంత సామాజిక వర్గం మద్దతు కూడ గట్టుకోక పోతే , వచ్చే ఎన్నికల నాటికి, పరిస్థితి మరింత దిగజారుతుందని అంచనాకు వచ్చారు.అది కాకుండా, కాపు నేస్తం పేరుతో వైసీపీ ప్రభుత్వం మహిళల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా సొమ్ము జమ చేయడం వంటి కారణాలతో మొత్తం ఆ సామాజిక వర్గం అంతా జగన్ వైపు వెళ్లిపోతారని ఆందోళనతో పవన్ ఇప్పుడు కాపు రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు.కాపులకు రిజర్వేషన్ కల్పించాలని, వైసీపీ ప్రభుత్వం వారికి సరైన న్యాయం చేయడం లేదంటూ, ఇలా అనేక అంశాలను తెరపైకి తీసుకువచ్చి కాపుల్లో వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం కలిగేలా చేయడంతో పాటు, జనసేన కు మద్దతు లభించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే వైసీపీ నేతలు పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఇప్పటి వరకు పవన్ ఎక్కడున్నారని ? రిజర్వేషన్ అంశం పై ముద్రగడ వంటివారు పోరాటం చేసిన సమయంలో అప్పటి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించి, నోరు ఎత్తేందుకు వై పడ్డారని, ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, పెద్ద ఎత్తున పవన్ పై విమర్శలు చేస్తున్నారు.అయినా పవన్ మాత్రం ఏదో ఒక రకంగా కాపు రిజర్వేషన్ అంశం తో వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు గా కనిపిస్తున్నారు.ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

#Pawan Kalyan #Janasena #Kapu Nestham #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Janasena Pawan Kalyan Ysrcp Related Telugu News,Photos/Pics,Images..