ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ మ‌రింత డేంజ‌ర్లో...!

జ‌న‌సేన‌పార్టీ ప‌రిస్థితి ఏంటి?  ఇటు ఏపీలోను, అటు తెలంగాణ‌లోనూ ఆ పార్టీ పుంజుకుంటుందా?  లేదా? అస‌లు జ‌న‌సేనాని ప‌వ‌న్ ప‌రిస్థితి ఏంటి? అంతకుమించి.రాజ‌కీయంగా ఆయ‌న అనుస‌రించే వ్యూహం ఏంటి? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కి వ‌స్తున్నాయి.దీనికి రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.ఒక‌టి అంతో ఇంతో ఇమేజ్ ఉన్న నాయ‌కుడుగా ప‌వ‌న్ మంచి మార్కులే వేసుకున్నారు.గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయినంత మాత్రాన వేస్ట్ అని తీసి పారేసే నాయ‌కుడిగా మాత్రం ఆయ‌న మిగిలిపోలేదు.యూత్‌లోనూ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గంలోనూ ఆయ‌న‌కు మంచి మార్కులు ప‌డుతున్నాయి.

 Pawan Political Future In Danger, Pawan Kalyan, Janasena, Janasena Party, Politi-TeluguStop.com

ఆయ‌న వ‌స్తే బాగుంటుంద‌ని చెప్పుకొనే వారు కూడా ఉన్నారు.

కానీ, ఎంత పెద్ద ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ.

వ్యూహాల్లో లోపాల కార‌ణంగా ప‌వ‌న్ వెనుక‌బ‌డి పోతున్నార‌నేది ప్ర‌ధానంగా వినిపిస్తున్న విమ‌ర్శ‌.దీనికి కార‌ణం.

ఆయ‌న బీజేపీ తో పొత్తు పెట్టుకోవ‌డం.రెండు హైద‌రాబాద్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పి కూడా త‌ప్పుకోవ‌డం.

ఇంకొక‌టి.కేవ‌లం తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు టికెట్ కోసం బీజేపీ అధిష్టానం ముందు సాగిల ప‌డుతున్నార‌నే ప్రచారం కావ‌డం.

నిజానికి ప‌వ‌న్ కు ఒంట‌రిగా పోటీ చేసే సత్తా ఉంది.ఆయ‌న‌కు మంచి ఇమేజ్ కూడా ఉంది.

గత ఎన్నిక‌ల్లో ఆయ‌న క‌మ్యూనిస్టులతో క‌లిసి పోరాటానికి దిగినా.ఒంట‌రి ఇమేజే ఆయ‌న న‌మ్ముకున్నారు.

పైగా క‌మ్యూనిస్టుల ఓటు బ్యాంకు త‌క్కువ‌.ప‌వ‌న్ వ‌ల్ల వారే బాగుప‌డ్డారు.

Telugu Bjp, Chandra Babu, Ghmc, Hyderabad, Janasena, Pawan Kalyan, Telangana, Ti

ఇక‌, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్ప‌టికీ.ఏపీలో బీజేపీ బ‌లం అంద‌రికీ తెలిసిందే.దీంతో ఇక్క‌డ కూడా బీజేపీకే లాభం త‌ప్ప‌.ప‌వ‌న్‌కు ఎలాంటి లాభం లేద‌ని అంద‌రూ అంటున్నారు.ఇక‌, తిరుప‌తిలో పోటీ చేయాలంటే.తానే స్వ‌యంగా అభ్య‌ర్థిని ఎంపిక చేసే స‌త్తా ఉండి కూడా బీజేపీని చూసి ఆయ‌న‌ సాగిల ప‌డుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

లేక‌పోతే.ఒక్క ‌టికెట్ కోసం.

ఇంత జిమ్మిక్కులు ఎందుకు చేస్తారు? అనే చ‌ర్చ సాగుతోంది.మొత్తంగా ప‌వ‌న్ అనుస‌రిస్తున్న విధానాలే బాగోలేవ‌ని అంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో కూడా చంద్ర‌బాబుతో క‌లిసిముందుకు వెళ్లి ఉంటే.బాబు మళ్లీ అధికారంలోకి రావ‌డంతో పాటు ప‌వ‌న్ పార్టీ కూడా క‌నీసం ప‌దిచోట్ల  అయినా.విజ‌యం సాధించి ఉండేద‌నే విశ్లేష‌ణ‌ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు.ఇలానే వ్య‌వ‌హ‌రిస్తే.

మున్ముందు మ‌రింత ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube