అమరావతిపై రంగంలోకి జనసేన

బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తమ బలం అమాంతం పెరిగింది అని భావిస్తున్న జనసేన పార్టీ అదే ఉత్సాహంతో ఏపీ లో వివిధ సమస్యలపై ప్రజా పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతోంది.వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా, ఏపీలో తమ బలం, బలగం అమాంతం పెంచుకోవాలని చూస్తోంది.

 Janasena Pawan Kalyan Plans About Amaravati Fight-TeluguStop.com

అందుకే తమ మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో కలిసి ఉమ్మడిగా పోరాడేందుకు అన్నిరకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.అమరావతి విషయంలో ఉద్యమ కార్యాచరణపై పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరగబోతుంది.

ఈ సమావేశంలో అమరావతిపై పార్టీపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

బీజేపీతో పొత్తు తరువాత కలిసి పనిచేయడం పైన ఈ సమావేశం లో చర్చించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

రాజధాని అంశం పై సోమవారం రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ప్రభుత్వ విధానాలను బట్టి జనసేన తన కార్యాచరణను ప్రకటింకేహెబోతోంది.రాజధాని అమరావతి నుంచి తరలించడానికి కుదరదంటూ పవన్ ఇప్పటికే తమ పార్టీ తరపున ప్రకటించారు.

రాజధాని తరలింపు పై సోమవారం ప్రభుత్వం నుంచి స్పష్టమైన క్లారిటీ రాబోతోంది.మూడు రాజధానుల విషయమై ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.

Telugu Amaravati, Ap Assembly, Janasena, Pawan Kalyan, Ys Jagan-

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుపై అధికార వైసిపి పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది.రాయలసీమ, కోస్తాంధ్ర నుంచి నలుగురు ఎమ్మెల్యేలు చొప్పున బిల్లుపై మాట్లాడబోతున్నారు.ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాజధాని అమరావతి నుంచి తరలించడాన్ని నిరసిస్తూ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది.అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా తలపెట్టింది.ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారు.దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.

ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు, రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ తమ ఉద్యమ కార్యాచరణను ఏ విధంగా ప్రకటించబోతుంది అనేది తేలాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube