పవన్ సంచలన నిర్ణయం,ఉపవాస దీక్షకు దిగిన జనసేనాని  

Pawan Kalyan Takes up Chaaturmaasya Deeksha, Janasena, Pawan Kalyan, Pawan Kalyan Chaaturmaasya Deeksha,Pawan Kalyan Latest Update - Telugu Janasena, Pawan Kalyan, Pawan Kalyan Chaaturmaasya Deeksha, Pawan Kalyan Latest Update

జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.నాలుగు నెలల పాటు ఆయన కఠిన ఉపవాస దీక్ష చేపట్టినట్లు సమాచారం.

 Janasena Pawan Kalyan Pawan Kalyan Chaaturmaasya Deeksha

ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని కాంక్షిస్తూ ఈ సారి ఆయన దీక్షను ప్రారంభించినట్లు తెలుస్తుంది.చాతుర్మాసంలో ఈ దీక్షను చేపట్టి ఆశ్వయుజ మాసంలో ముగించనున్నట్లు తెలుస్తుంది.

బుధవారం తోలి ఏకాదశి సందర్భంగా ఈ దీక్షను చేపట్టి ఆశ్వయుజ మాసం లో ముగించనున్నారు.అయితే ఈ ఉపవాస దీక్ష అన్ని రోజులు కూడా ఆయన కేవలం ఒంటి పూట భోజనం చేసి నియమబద్ద జీవితాన్ని గడపనున్నట్లు తెలుస్తుంది.

పవన్ సంచలన నిర్ణయం,ఉపవాస దీక్షకు దిగిన జనసేనాని-Political-Telugu Tollywood Photo Image

అయితే గత 20 సంవత్సరాలు గా పవన్ ఈ దీక్ష చేపడుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా రోగ్యాన్ని కాంక్షిస్తూ ఈ దీక్షను చేపట్టినట్లు తెలుస్తుంది.అలానే ఈ దీక్షను విరమించే సమయంలో హోమాన్ని కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

నాలుగు నెలల పాటు ప్రతి రోజూ కూడా ఒంటిపూట భోజనం, సూర్యాస్తమయం సమయం తర్వాత పాలు, పండ్లు తీసుకుంటారు.కరోనా వైరస్ పట్టి పీడిస్తోన్న సమయంలో ప్రజలు ఆర్థికంగా, మానసికంగా ఎదుర్కొని ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటూ ఈ సారి ఈ దీక్షను చేపట్టినట్లు పవన్ తెలిపారు.

కరోనా కారణంగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారని, వీటి నుంచి ప్రజలంతా కోలుకొని మనోధైర్యంతో ఉండాలని ఈ ఏడాది దీక్ష తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు.కాగా జనసేనాని గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఈ కఠిన ఉపవాస దీక్షలు చేస్తూనే ఉండగా ఈ సారి మాత్రం ప్రజా క్షేమం కోసం ఈ దీక్షను చేపట్టినట్లు తెలుస్తుంది.

#Pawan Kalyan #Janasena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Janasena Pawan Kalyan Pawan Kalyan Chaaturmaasya Deeksha Related Telugu News,Photos/Pics,Images..