తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ( Janasena ) ఎనిమిది స్థానాల్లో పోటీకి దిగుతోంది .ఇప్పటికే బిజెపితో పొత్తు( BJP ) కుదిరిన నేపథ్యంలో , రెండు పార్టీల మధ్య సర్దుబాటు ముగిసింది.8 స్థానాలను జనసేనకు కేటాయించడంతో అభ్యర్థులు నామినేషన్లు వేశారు .ఇక బిజెపి, జనసేన అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలంగాణ బిజెపి ఆశలు పెట్టుకున్నా, పవన్ మాత్రం ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే అప్పుడప్పుడు పవన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప, తెలంగాణ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.దీంతో జనసేన తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు, బిజెపి అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు.
పవన్ వస్తారు .ఎన్నికల ప్రచారంలో ఊపు తెస్తారని ఆశలు పెట్టుకున్న జనసేన బిజెపి వర్గాల్లో ఒక ఇంత ఆందోళన కనిపిస్తోంది .అయితే పవన్ ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

ఇది ఇలా ఉంటే తెలంగాణలో జనసేన( Telangana Janasena ) పోటీ చేస్తున్న ఎనిమిది స్థానాల్లో ఒక కూకట్ పల్లి నియోజకవర్గానికి( Kukatpally ) మాత్రమే పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఈనెల 26న కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) తెలంగాణ పర్యటనకు వస్తున్నారు.ఆ రోజునే కూకట్ పల్లి సభను ఏర్పాటు చేశారు .ఈ సభకు పవన్ కళ్యాణ్ తో పాటు, అమిత్ షా కూడా పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ కూడా అధికారికంగా ప్రకటించింది.
ఈ ఒక్క నియోజకవర్గంలో తప్ప, మిగతా నియోజకవర్గాల్లో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం కనిపించడం లేదు.జనసేన తరఫున ఎన్నికల బరిలో దిగిన వారికి గతంలో పోటీ చేసిన అనుభవం లేకపోవడం, రాజకీయాలకు చాలామంది కొత్తవారు కావడంతో , ఎన్నికల నిర్వహణలో చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్థికంగా కొంతమందికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, పార్టీ నుంచి ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు అందడం, పార్టీ తరఫున కీలక నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే అభ్యర్థులలోను ఉత్సాహం కనిపిస్తుంది.కానీ పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించకపోవడం , పార్టీ నుంచి తగిన సూచనలు అందించకపోవడంతో, జనసేన వర్గాలు కాస్త కనిపిస్తోంది.కనీసం పవన్ ప్రతి నియోజకవర్గంలో కనీసం కొంత సమయం ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, అలా కుదరని పక్షంలో రోడ్డు షో నిర్వహించినా తమకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని బిజెపి, జనసేన అభ్యర్థులు భావిస్తున్నారు. అయితే పవన్ ఎన్నికల ప్రచారం విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది మాత్రం ఎవరికీ అంత పట్టడం.